కరణం, గొట్టిపాటి పై బాబు సీరియస్

Update: 2017-12-01 10:39 GMT

కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ లపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పాత, కొత్త నేతలందరూ కలిసి వెళ్లాలని ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు గొడవ పడుతున్నారని సీరియస్ గా ప్రశ్నించారు. కొందరికి ఎమ్మెల్సీల పదవులు ఇచ్చానని, ఎవరినీ తాను నిర్లక్ష్యం చేయకపోయినా నేతలు ఘర్షణలు పడుతుండటంతో పార్టీ పరువు బజారున పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 49 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదని చంద్రబాబు చెప్పారు. ఆ నియోజకవర్గాల్లో నేతలు నిరంతరం ప్రజల వద్దనే ఉండాలని ఆయన హితబోధ చేశారు. నిన్న కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాలు డీసీసీబీ ఛైర్మన్ పదవి కోసం మంత్రి శిద్ధా రాఘవరావు ఛాంబర్ లో ఘర్షణకు దిగిన సంగతి తెలిసిందే.

Similar News