కమల్ ఎందుకిలా చేస్తున్నారో...?

Update: 2017-11-05 04:30 GMT

దేశంలో హిందూ తీవ్రవాదం పెరిగిపోయింది అంటూ హీరో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. తమిళనాడు లో పార్టీ పెట్టేముందు కమల్ ఇలా మాట్లాడటం చర్చనీయాంశం అయ్యింది. ఆయన ఏ ఉద్దేశ్యంతో వివాదం సృష్టించారన్నది హాట్ టాపిక్ అయ్యింది. కమల్ క్షమాపణలు చెప్పాలని బేషరతుగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని హిందూ మత ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. పలు చోట్ల ఆయన చేసిన కామెంట్స్ పై కేసులు సైతం నమోదు అయ్యాయాయి.

రాజకీయ మైలేజ్ కోసమేనా .....

కమల్ హాసన్ కొత్తగా పెట్టబోయే పార్టీ పూర్తి బిజెపి వ్యతిరేకం అనే అంశం ప్రజల్లోకి వెళ్ళాలనే కోరి వివాదాస్పద కామెంట్స్ చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఓట్లు, సీట్లు కావాలంటే మతాన్ని మించిన ఔషధం లేదని భావించే కమల్ మత ప్రాతిపదిక ఓట్ల కోసం ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలకు దిగుతున్నారని బిజెపి అంటోంది. తమిళనాడు వాసులు ఉత్తరాది పెత్తనాన్ని ఏ మాత్రం సహించరు. కేంద్రంలో ఉత్తరాది పెత్తనాన్ని నిత్యం ప్రశ్నిస్తూనే వుంటారు. తమిళ , ఆంగ్ల భాషలకు తొలి రెండు భాషలుగా వినియోగిస్తారు. ఇలా అనేక అంశాలు లెక్కలు వేసుకుని కమల్ సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తమిళనాడు లో డీఎంకే , అన్నా డీఎంకే ఓటు బ్యాంక్ పటిష్టం చేసుకున్నాయి. ఈ దశలో కొత్త రాజకీయ పార్టీ అరంగేట్రం చేసే సమయంలో ఆ రెండు పార్టీలకు విభిన్న వైఖరి వెల్లడి చేయాలిసి వుంది. ఈ నేపథ్యంలోనే కమల్ హిందువులపై వ్యాఖ్యలు చేసి మిగిలిన వర్గాలకు దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా మైనారిటీ, క్రైస్తవ ఓటు బ్యాంకు అన్నా డీఎంకే , డీఎంకే లనుంచి లాగాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకుల అంచనా.

Similar News