వైఎస్ జగన్ ఒక్క రోజు మాత్రమే విశ్రాంతి తీసుకున్నారు. సంక్రాంతికి రెండు రోజులు రెస్ట్ తీసుకుందామనుకున్నా... పాదయాత్ర షెడ్యూల్ ఆలస్యం అవుతుందని భావించిన జగన్ కనుమ రోజైన మంగళవారం పాదయాత్రకు బయలుదేరారు. నిన్న సంక్రాంతి సంబరాలు జరుపుకున్న జగన్ ఈరోజు ఉదయమే పాదయాత్రను చిత్తూరు జిల్లాలో ప్రారంభించారు.
నేటి పాదయాత్ర షెడ్యూల్....
ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లాలోని పారకాల్వ క్రాస్ రోడ్స్ నుంచి జగన్ పాదయాత్ర ప్రారంభమయింది. అక్కడి పత్తి పత్తూరు, పుడి క్రాస్, అప్పలాయగుంట, యెనుమల పాలెం, తిరుమన్యం, రాజుల కండ్రిగ, వేమపురం, గొల్లకండ్రిగ వరకూ యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం వడమల, వడమల పేట మీదుగా పాడిరేడుకు చేరుకోనున్న జగన్ అక్కడే రాత్రి బస చేయనున్నారు.