హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది.. మహిళలకు రక్షణ లేకుండా పొయింది. క్యాబ్ డ్రైవర్స్ నుంచి మహిళలకు రక్షణ లేకుండా పొతుంది. ఇప్పడు ప్రతి ఒక్కరూ సిటీలో ప్రయాణం కోసం క్యాబ్ నే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి క్యాబ్ డ్రైవర్ నుంచి ఇప్పడు మహిళలకు రక్షణ కరువైంది.ముఖ్యంగా నైట్ టైమ్ లో వెళ్లుతున్న మహిళలపై లైగింక దాడులు జరుగుతున్నాయి.. ఇందుకు హైదరబాద్ లోని ఒక క్యాబ్ చేసిన వికృత చేష్టలు ఇప్పడు మహిళలు క్యాబ్ లో ప్రయాణం చేయాలంటే భయం పుడుతుంది. తాజాగా కుషాయి గూడ ప్రాంతంలో జరిగిన ఒక క్యాబ్ డ్రైవర్ చేసిన అరాచకం బయటపడింది.
నమ్మకంగా కారు ఎక్కించుకుని....
ఈ నెల ఐదో తేదీ రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఒక యువతి రోడ్డు పైన నిలబడింది. తాను లాలాగూడ ప్రాంతానికి వెళ్లవలసి వుంది. అప్పడే తన వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వెళదామని అనుకుంది. గతంలో ఎయిర్ టెల్ కాల్ సెంటర్ లో ఈ యువతి పనిచేసేది. ఇటీవల ఈ కంపెనీకి గుడ్ బై చెప్పంది. కుషాయిగూడ ప్రాంతంలోని రాధిక ధియేటర్ ప్రాంతం నుంచి తన ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేసింది. అప్పటికే క్యాబ్ ను బుక్ చేసింది. ఇంతలో ఓలా క్యాబ్ డ్రైవర్ అయిన నాగేంద్ర అటుగా వెళ్లుతున్నాడు. తాను లాలాగూడ వైపుగా వెళ్లుతున్నాను.. కావాల్సి వస్తే తన ఐడి కార్డు చూడమని చెప్పాడు. ఇది నమ్మిన అమ్మాయి వెంటనే క్యాబ్ లోకి ఎక్కింది. కొద్ది దూరం వరకు కర్టెక్ దారిలోనే వెళ్లాడు. కొద్ది దూరం తరువాత రూట్ ను మార్చాడు. ఇలా ఎందుకు వెళ్లుతున్నవాని అడిగితే తన ఫ్రెండ్స్ కూడా ఇదే దారిలో వున్నారు. వాళ్లను కూడా ఎక్కించుకుని వెళ్లుదామని చెప్పాడు. రాత్రి సమయంలో ఎక్కడో తిప్పుతున్నాడని ఆ యువతి భయపడింది.
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి....
దీంతో డ్రైవర్ ఆ అమ్మాయికి ధైర్యం చెబుతున్నట్లుగా నటించాడు. వెంటనే మీరు భయపడకండి.. వెనుక సీట్లో ధైర్యంగా కూర్చోమని చెప్పాడు. దీంతో అమ్మాయి వెంటనే వెనుక సీట్ లోకి వెళ్లి కూర్చుంది. ఇలా కూర్చున్న తరువాత పది నిమిషాల్లోఒక్క నిర్మానుష్య ప్రాంతానికి కారు ను తీసుకుని పొయాడు. అక్కడ కారు ను ఆపాడు . వెంటనే వెనుక సీట్లో వున్న అమ్మాయి దగ్గరకు వెళ్లి బలత్కారం చేసేందుకు ప్రయత్నం చేశాడు. అమ్మాయిలుకాళ్లును బంధించాడు. అమ్మాయితో ఒక్క పశువులాగా ప్రవర్తించాడు. అమ్మాయిని రెప్ చేసెందుకు ప్రయత్నం చేశాడు. ఐదునిమిషాల పాటు నాగేంద్ర ఒక్క పశువులాగా వ్యవహరించాడు. అమ్మాయి ప్రతిఘటించి నాగేంద్రపైన దాడి చేసి అక్కడి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కారు నెంబర్ లేకపొవడంతో పోలీసులు వెంటనే సిసి కెమెరాలను పరిశీలించారు. ఎక్కడా సరియైన ఫుటేజీ దొరకలేదు. దీంతో వారం రోజులు ఆ ఏరియాలో ఉన్న అన్ని సీసీ కెమెరాలను పరిశీలించగా ఒక్క దగ్గర కారు నెంబర్ దొరికింది. దీని ఆధారంగా నాగేంద్ర నుపోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇప్పటికి ఆరుగురు అమ్మాయిలను ఇదే మాదిరిగా అత్యాచారం చేసినట్లు నాగేంద్ర తెలిపాడు. నవంబర్ లో ఒక బాలికను కూడా కిడ్నాప్ చేసి అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేశానని పోలీసులకు నాగేంద్ర చెప్పాడు. నాగేంద్ర ను పోలీసులు రిమాండ్ తరలించారు.. ఓలా డ్రైవర్ అరాచకలపైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు.