ఒంగోలులో పవన్ కల్యాణ్...!

Update: 2017-12-09 05:05 GMT

జనసేన అధినేనత పవన్ కల్యాణ్ ఒంగోలుకు వెళ్లారు. ఇటీవల కృష్ణానదిలో పడవ ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన 20 మంది మృతి చెందిన సంఘటన తెలిసిందే. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తాము కుటుంబసభ్యులను కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లైసెన్సు లేని బోట్లను తిప్పడం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పవన్ కు వివరించారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందిందని పవన్ వారిని ప్రశ్నించారు.

Similar News