దేశంలో భారీ యెత్తున ఐసిస్ దాడులకు తెగబడే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చిరిస్తున్నాయి. ప్రధానితో పాటుగా ముఖ్యమైన మంత్రులపైనా దాడులు చేసే అవకాశం ఉందని ఐబి హెచ్చిరిస్తుంది. అలాగే ఇవాంక ట్రంప్ రాక సందర్బంలో కూడా అప్రమత్తంగా వుండాలని ఐబి చెబుతుంది. ఇప్పడు హైదరబాద్ అధికారులకు ఇవాంక ట్రంప్ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా కూడ ఇవాంక ట్రంప్ గురించే చెబుతున్నారు. ఇవాంక రాక ఎమో గాని ఇప్పడు అధికారులు ఉరుకులు పరుగుల మీద పనులు చేస్తున్నారు.
భద్రత చర్యలు కట్టుదిట్టం....
అమోరికా అధ్యక్షుడు కూమార్తె ఇవాంకా రాకకు మరికొన్ని రొజులే మిగిలి ఉంది. ఇవాంకా వస్తున్న నేపథ్యంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఇప్పటి ఇవాంక పర్యటనలు చేసే ప్రాంతాలన్నింటికి కూడా పోలీసులు తమ కస్టడిలోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పొర్టు. హైటెక్స్. వెస్టీన్ హొటల్స్. ఫలక్ నూమా ప్యాలెస్ లను అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేగాకుండా ఈ చుట్టు పక్కల ప్రాంతాలన్నింటిని కూడా తమ ఆధీనంలో తీసుకున్నారు అధికారులు. ప్రధానంగా ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రదాని మోడీ డిన్నర్ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో దీని చుట్టు ప్రక్కల ప్రాంతాలన్నింటిలో కూడా పోలీసులు క్షుణంగా తనీఖీలను నిర్వహించారు.
కొత్తవారిపై ఆరా....
ప్రధానంగా కొత్త వారి రాక పోకలతో పాటుగా అక్కడ వుంటున్న వారి వివరాలను సేకరించారు. అలాగే ఇక్కడ అద్దెకు వుంటున్న వారి వివరాలను కూడా అధికారులు తెలుసుకుంటున్నారు. దీంతో పాటుగా మాదాపూర్ లోని రహెజా మైండ్ స్సేస్ లో వున్న వెస్టీన్ హొటల్ చుట్టు ప్రక్కల కంపెనీల్లో పనిచేస్తున్న వారి వివరాలతో పాటుగా స్టాప్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్న వారి వివరాలను కూడా అధికారులు సేకరించారు. అలాగే ఫలక్ నూమా ప్యాలెస్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో కూడా ఇదే తరహా సమాచారాన్ని తీసుకుంటున్నారు. చాలా వరకు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నిఘా ను కట్టు దిట్టం చేశారు.
ఎయిర్ పోర్ట్ లో మాక్ డ్రిల్...
ఇదిలా వుంటే శంషాబాద్ ఎయిర్ పొర్టులో నాలుగు రొజుల క్రితమే మాక్ డ్రిల్ ను చేశారు. హైజాకింగ్ లాంటివి జరిగితే ఎలా వ్యవహారించాలన్న దానిపైన మాక్ డ్రిల్ ను ఎయిర్ పొర్టులో చేశారు. ఇక పొతే శంషాబాద్ ఎయిర్ నుంచి మాదాపూర్ వరకు ఔటర్ రింగ్ వరకు రొడ్డు మీద వెళతారా.. లేక హెలికాప్టర్ లో హొటల్ కు వెళతారా అన్న దానిపైన ఇంకా సందిగ్దత కొనసాగుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు అయితే దాదాపుగా ఇరవై కిలో మీటర్ల వరకు రోడ్డు ప్రయాణం చేయవలసి వుంటుంది ఇవాంకా. అలాంటప్పడు సెక్యూరిటి సమస్యలు వచ్చేఅవకాశం వుంటుందని అధికారులు అంటున్నారు.
అప్రమత్తమైన అధికారులు....
ఇదిలా వుంటే దేశ వ్యాప్తంగా ఐసీసీ దాడులు చేసే అవకాశం వుంటుందని నిఘా వర్గాలు అనూమానిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ కూమార్తె ఇండియాలో పర్యటిస్తున్న నేపథ్యంలో దాడులకు తెగబడే అవకాశం వుంటుందని నిఘా వర్గాలు ఒక అనూమానం వ్యక్తం చేస్తున్నాయి. ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని రాష్ట్రాలకు ఐబి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో పాటుగా మంత్రుల పర్యటన వివరాలను ఐబితో పాటుగా రాష్ట్ర పోలీసులకు ఎప్పటికప్పడు సమాచారం ఇచ్చిన తరువాతనే పర్యటించాలని ఆదేశించింది.