ఐపీఎస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న కలెక్టర్....!

Update: 2018-02-19 02:30 GMT

ఆమ్రపాలి... పరిచయం అక్కరలేని పేరు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ గా సంచలనాలు సృష్ట్టించిన ఆమ్రాపాలి తను ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడింది. కాశ్మీర్ కి చెందిన యువ ఐపీఎస్ సమీర్ శర్మ చేత మూడు ముళ్ళు వేయించుకుంది. పేరుకి ప్రేమ వివాహమే అయినా ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆమె ప్రేమ ఫలించింది. మద్రాస్ ఐఐటి లో సివిల్ ఇంజనీరింగ్ చదివి, బెంగుళూరు లో ఉన్నత విద్య అభ్యసించి 2010 లో సివిల్స్ లో 39 వ ర్యాంక్ సాధించి ప్రతిభావంతురాలు గా పేరు తెచ్చుకున్న అమ్రాపాలి సంచలన కలెక్టర్ గా హల్చల్ చేస్తున్నారు.

సోషల్ మీడియా లో ట్రెండ్ సెట్టర్ ...

సోషల్ మీడియా లో ఆమె పేరిట పదుల సంఖ్యలో ఫెస్ బుక్ పేజీలను అభిమానులు నిర్వహిస్తున్నారు. పాలనా వ్యవహారాల్లో సాంకేతిక విప్లవాన్ని జోడించి ప్రజల్లో తిరుగుతూ కలెక్టర్ తెలంగాణ లోనే కాదు ఆంధ్రాలోనూ నిత్యం వార్తల్లో వుంటారు. విశాఖ కు చెందిన ఆమ్రా ట్రెక్కింగ్ వంటి సాహస క్రీడలను కలెక్టర్ గా ఉంటూనే పాల్గొనడం విశేషం. సమీర్ శర్మ తో మూడు ముళ్ళు వేయించుకున్న యువ ఐఏఎస్ తన వివాహా రిసెప్షన్ ను హైదరాబాద్ లో భారీగా ప్లాన్ చేశారంటున్నారు. హనీమూన్ టర్కీలో సెట్ చేసినట్లు కుటుంబవర్గాల కధనం. మొత్తానికి ట్రెండ్ సెట్టర్ గాటాక్ వున్న ఆమ్రాపాలి తన పెళ్ళి ని సైతం డిఫరెంట్ గానే చేసుకోవడం విశేషం

Similar News