పొట్టి క్రికెట్ వేలం ప్రారంభమయింది. అయితే మొదటి విడత ఐపీఎల్ సీజ్ 11 వేలంలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తొలుత శిఖర్ ధావన్ తో మొదలైనవేలం అట్టహాసంగా జరుగుతోంది. ఇంగ్లండ్ ప్లేయర్ బెన్స్టోక్స్ ను రాజస్థాన్ రాయల్ జట్టుఅత్యధికంగా 12.50 కోట్లకు చేజిక్కించుకుంది. దక్షిణాఫిక్రా టీం కెప్టెన్ డూప్లిసిస్ ను చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 1.60 కోట్లకు చేజిక్కించుకుంది. అజ్యింక రహానేనను రాజస్తాన్ రాయల్స్ జట్టు నాలుగు కోట్లకు కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్ ను కోల్ కత్తా నైట్ రైడర్స్ 9.40 కోట్లకు కొనుగోలు చేసింది.
ధావన్ హైదరాబాద్ జట్టుకే....
ఇక ఇండియన్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ ను హైదరాబాద్ సన్ రైజర్స్ 5.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 7.60 కోట్లకు దక్కించుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ సూచన మేరకు ప్రీతి జింతా అశ్విన్ ను తమ జట్టులోకి వచ్చేందుకు అత్యధికంగా వెచ్చించి కొనుగోలు చేశారు. విండీస్ ఆటడాడు కిరీస్ పొలార్డ్ ను ముంబయి ఇండియన్స్ జట్టు 5.40 కోట్లకు కొనుగోలు చేసింది.
గేల్ కు పరాభవం....
ఇక పొట్టిక్రికెట్ లో విధ్వంస కర ఆటగాడిగా పేరుపొందిన క్రిస్ గేల్ ను ఎవరూ కొనుగోులుచేయడానికి ఆసక్తి చూపలేదు. గేల్ కు ఐపీఎల్ లో మంచి రికార్డుంది. అయినా ఏ జట్టు గేల్ ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో గేల్ ను అమ్ముడుపోని ఆటగాడిగా ప్రకటించారు. ఐపీఎల్ 11 వేలం ఇంకాకొనసాగుతోంది. మొత్తం మీద ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ఆసక్తికరంగా ప్రారంభమైంది.