ఉమ్మడి రాష్ట్రంలో సంచలనం స్రుష్టించిన ఎమ్మార్ స్కాంకు కొలిక్కి వస్తుంది. 2012లో కేసు నమోదు చేసిన సి.బి.ఐ. అభియోగాల పై హైకోర్టు తొసిపుచ్చుతోంది. నిన్న ఐ.ఏ.ఎస్. ఎల్వీ సుబ్రమణ్యంకు.. ఇవాళ.. ప్రధాన నిందితుడిగా భావించే కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు కొనేరు మధు పై హై కోర్టు కేసులు కొట్టివేయడంతో సి.బి.ఐ కోర్టులో విచారణ పూర్తి కాకుండానే వారి పాత్ర లేదని తెలిపోతుంది. దీంతో సి.బి.ఐ. మోపిన అభియోగాలు రాజకీయ కక్షేనని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి అంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో స్కాంలు జరిగాయన్న ప్రధాన అభియోగాలకు హైకోర్టు క్లీన్ చీట్ ఇస్తూ వస్తోంది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత 2012లో ఎమ్మార్ కు కేటాయించిన భూముల్లో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ కు....
హైదరాబాద్ మణికొండలో ఎమ్మార్ కంపెనీకి 531 ఎకరాల భూమిని కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) , ఎమ్మార్, ఎమ్.జీ.ఎఫ్. జాయింట్ వెంచర్‌గా అభివృద్ది చేశాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్ విల్లాలు, హోటళ్లు, క్లబ్‌హౌస్, గోల్ఫ్‌కోర్సు, టౌన్‌షిప్ ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. అయితే ఈ వెంచర్‌లో ప్రభుత్వ వాటాను 25 శాతం నుంచి 7 శాతానికి తగ్గించారని తగ్గింపు అదాయం మొత్తం ఎమ్మార్ కు లబ్ది చేకూరేలా చేశారని ప్రధాన అభియోగంతో సి.బి.ఐ. కేసు నమోదు చేసింది. ఆ సమయంలో ఎల్వీ సుబ్రమణ్యం, బీపీ ఆచార్యలు ఏపీఐఐసీ చైర్మన్, ఎండీలుగా ఉన్నారు. ఎమ్మార్ ఒప్పందాలను నీరుకార్చడంలో ఎల్వీ, ఆచార్య కీలకపాత్ర వహించారని, ప్రతిఫలంగా విల్లాలను పొందారని సీబీఐ అభియోగం మోపింది. అయితే అప్పటి మంత్రి మండలి నిర్ణయం మేరకే అధికారులుగా తాము వ్యవహారించామని ఐ.ఏ.ఏస్ లు కోర్టులో వాదనలు వినిపించారు. రియల్ ఎస్టేట్ లో నష్టాలు వస్తున్నందునే అప్పటి ప్రభుత్వం వాటా తగ్గించాల్సి వచ్చిందని, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని సి.బి.ఐ.కి తెలిపనట్లు ఉన్నత న్యాయస్థానానికి తెలిపారు. దీంతో గురువారం జస్టిస్ శివశంకర్ ఎల్వీ సుబ్రమణ్యం వాదనలకు ఏకీభవిస్తూ..కోనేరు రాజేంద్రప్రసాద్ కుమారుడు మధుపై నమోదయిన సి.బి.ఐ. కేసును కోట్టివేసింది.
రాజకీయ కక్షలతోనే....
ప్రభుత్వానికి నష్టం వాటిళ్లిన సొమ్ము అంతా దుబాయిలో ఉండే మధు అకౌంట్స్ లోకి చేరిందని సి.బి.ఐ. ప్రధాన అబియోగం. మధు తరుపున మాజీ అట్నారీ జనరల్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎన్నో వ్యాపారాలు ఉన్న మధు పై కావాలనే సి.బి.ఐ. ఇరికించిందని వాదించారు. ఆ డబ్బులకు మధు అకౌంట్స్ లో ఉన్న డబ్బులకు సంబందం లేదని చెప్పారు. ఐపీసీ 120బీ, 420, 477-ఏ, అవినీతి నిరోధక చట్టం 13(2), 13 (1) డీ కింద కేసులు నమోదు చేసిన సి.బి.ఐ. కనీసం సి.బి.ఐ. కోర్టులో విచారణ జరగకుండాగానే నిందితులు హైకోర్టు నుంచి నిర్దోషిగా బయటపడుతున్నారు. దీంతో అప్పటి కేసులు అన్ని రాజకీయ కక్షపూరితంతోనే జరిగాయనే విమర్శలకు బలం చేకూరేలా హైకోర్టులు తీర్పులు ఉన్నాయని చెబుతున్నారు. జగన్ పి.ఎ. సునీల్ రెడ్డి ఈ కేసులో నిందుతుడిగా ఉన్న నేపథ్యంలో జగన్ కు అవినీతి మరకలు అంటించే ప్రయత్నం చేశారని వై.సీ.పీ.నేతలు అంటున్నారు. అప్పటి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఊపు తెచ్చేందుకే వై.ఎస్. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి పై కావాలనే ఉద్దేశంతో కక్షసాదించారనే అరోపణలు చేస్తున్నారంటున్నారు.