ఏపీలో...గుప్పిట తెరిస్తే....ఇక అంతే...!

Update: 2018-01-09 03:30 GMT

పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి.. పీఏసీ అత్యంత కీలకమైన కమిటి. ఈ కమిటి కి ఆర్ధిక శాఖ పూర్తిగా జవాబుదారీ. విపక్షానికి చెందిన వారు ఈ కమిటి కి ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. కేబినెట్ ర్యాంక్ కమిటి ఛైర్మన్ కి కల్పిస్తారు. అంతటి ప్రాధాన్యత గల ఈ కమిటి సమావేశం అమరావతి లో వైసిపి నేత బుగ్గన రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటైంది. ఈ సమావేశంలో కమిటి అడిగిన అన్ని ప్రశ్నలకు ఆర్ధిక శాఖ అధికారులు నీళ్లు నమిలారు. వారేమి దారుణమైన ప్రశ్నలు కానీ సమాధానం దొరకనివి అడగలేదు. చాలా చిన్న ప్రశ్నలే. కానీ వాటికి అధికారుల దగ్గర సమాధానం లేకపోవడం విచిత్రం విడ్డురమే.

ఇంతకి పిఎసి ఏమి అడిగింది ... అధికారులు ఏం చెప్పారు ..?

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం విభజన తరువాత తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 17 వేలకోట్ల లోటు బడ్జెట్ తో ప్రారంభమైన కొత్త రాష్ట్రానికి ఆ లోటు భర్తీ చేస్తామని చెప్పిన కేంద్రం నుంచి సాయం అందలేదు. దీనికి తోడు సర్కార్ దుబారా ఖర్చులు, తెస్తున్న అప్పులు పుట్టి ముంచుతున్నాయి. దాదాపు లక్ష కోట్ల రూపాయలకు పైనే ఏపీ రుణభారం పేరుకుపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ ఖజానా వాస్తవ పరిస్థితిని ఆర్ధిక శాఖ కప్పిపుచ్చడం పలు అనుమానాలకు దారితీస్తుంది. పిఎసి సమావేశంలో కమిటి ఛైర్మన్ సభ్యులు ఆర్ధిక దుస్థితి ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేసినా సఫలం కాలేదు. 2014 లో ఏపీ ఆదాయం ఎంత వ్యయం ఎంత 2015 2016 ఆర్ధిక సంవత్సరానికి ఆదాయం ఖర్చు , అలాగే 16 -17 లో వచ్చింది పోతుంది ఎంత ? ఈ చిన్న ప్రశ్న కు అధికారుల దగ్గర సమాధానం లేకపోవడం తో కమిటి సభ్యులు తీవ్ర అసహనానికి లోనైయ్యారు.

అంతా గందరగోళమే ....

30 వేలకోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ ఎందుకు ఉందొ చెప్పాలని కోరారు. దానికి వారిదగ్గర సమాధానం లేదు. ప్రజల్లో రాష్ట్ర ఆర్ధిక స్థితి తెలుసుకోవాలని సామాన్యుల్లో వుండే చిన్న చిన్న సందేహాలకు పిఎసి ద్వారా సమాధానం లభిస్తుందన్న ఆశ అడియాసే అయ్యింది. వచ్చే సమావేశాలకు అయినా ప్రిపేర్ అయ్యి రావాలంటూ కమిటి సైతం చేసేది ఏమి లేక మౌనం వహించింది. ఇక అక్కడే వున్న ఆడిట్ అధికారులు పిఎసి ముందు అధికారుల వ్యవహారాన్ని చూసి అవాక్కవక తప్పలేదు. దీనిని బట్టి ఏపీ ఆర్ధిక దుస్థితి ఏ రేంజ్ లో ఉందో తేటతెల్లం అవుతుందంటున్నారు నిపుణులు. రాజ్యాంగ బద్ధ కమిటీల ముందు కూడా నిజాలు ప్రజలతో పంచుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తుందనడానికి తాజా సంఘటనే నిదర్శనం గా నిలుస్తుం

Similar News