ఏపీకి కొత్త బాస్ ఎవరు?

Update: 2017-12-24 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ డీజీపీ వ్యవహారం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చేలా కన్పించడం లేదు. ఏపీ డీజీపీగా ప్రస్తుతం నండూరి సాంబశివరావు వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఏపీ డీజీపీగా నండూరి సాంబశివరావును కొనసాగించాలని ఏపీ సర్కార్ తీవ్ర ప్రయత్నమే చేసింది. వచ్చే ఎన్నికల వరకూ నండూరినే కొనసాగించాలన్నది సర్కార్ ఆలోచన. ఈమేరకు యూపీఎస్సీకి కూడా జాబితాను పంపింది. అయితే ఏపీ సర్కార్ ప్రభుత్వం పంపిన జాబితాను యూపీఎస్సీ వెనక్కు పంపింది. తక్కువ వ్యవధిలో పదవీ విరమణ చేసే వారిని డీజీపీ కొనసాగించడానికి నిబంధలను అంగీకరించవని, సుప్రీంకోర్టు కూడా ఇదే స్పష్టం చేసిందని యూపీఎస్సీ పేర్కొంది.

కొత్త చట్టం తేవాలని...

అయితే దీనికి విరుడుగా కర్ణాటక తరహాలో కొత్త చట్టం తేవడానికి ఏపీ సర్కార్ సిద్ధమయింది. మంత్రిమండలి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ చట్టం 2017 కు ఆమోదం కూడా తెలిపింది. అయితే ఆర్డినెన్స్ తేవాల్సి ఉంది. ఈ ఆర్డినెన్స్ వస్తే ఏపీ సర్కార్ తానే జాబితాను రూపొందించుకుని కొత్త డీజీపీని నియమించుకోవచ్చు. దీంతో నండూరి సాంబశివరావును మరో రెండేళ్లు డీజీపీగా కొనసాగించడానికి అంతా సిద్ధమయిందని అందరూ భావించారు.

కొనసాగలేనన్న నండూరి...

అయితే ఊహించని విధంగా నండూరి సాంబశివరావు తాను పదవిలో కొనసాగేందుకు అంగీకరించలేదని తెలిసింది. తాను ఇక కొనసాగలేనని, ఈ నెల31వతేదీన పదవీ విరమణ చేస్తానని నేరుగా ముఖ్యమంత్రికే చెప్పారు. దీంతో కొత్త డీజీపీ నియామకం కోసం ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ పరిశీలనలో మాలకొండయ్య, గౌతమ్ సవాంగ్ పేర్లు విన్పిస్తున్నాయి. మాలకొండయ్య మరో ఆరునెలలో పదవీ విరమణ చేయనున్నప్పటికీ ఆయననే నియమించాలని ప్రభుత్వం భావిస్తన్నట్లు సమాచారం. మొత్తం మీద ఏపీ డీజీపీ నియామకంలో ఇంకా స్పష్టత రాలేదు.

Similar News