ముఖ్యమంత్రి చంద్రబాబు లేకుండానే ఆంధ్రప్రదేశ్ లో గణతంత్ర వేడుకలు ముగిశాయి. గతతంత్ర దినోత్సవానికి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, మనవుడు దేవాన్ష్ లు హాజరయ్యారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే అధికారిక షెడ్యూల్ ప్రకారం ఈరోజు ఉదయానికల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ చేరుకోవాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు గణతంత్ర వేడుకల్లో పాల్గొనలేకపోయారు. వాతావరణ సమస్య తలెత్తడంతో ఆయన అబుదాబిలోనే ఆగిపోయారని, సాయంత్రం నాలుగు గంటలకు సీఎం విజయవాడకు చేరుకుంటారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.