ఏం బాలేదు ... బాబు అసంతృప్తి ...!

Update: 2017-10-28 09:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముళ్ల పనితీరుపై సంతృప్తిగా లేరు. మీ పని తీరు ఏమి బాలేదు అంటూ ఆయన వ్యాఖ్యానించడం టిడిపిలో చర్చనీయాంశం అయ్యింది . ముఖ్యంగా 14 నియోజకవర్గాల్లో ఇంటింటికి టిడిపి ఘోరంగా ఉందన్న నివేదికలు చంద్రబాబు చేతికి అందాయి. దాంతో ఆయన ఇదేమి పనితీరు అంటూ విరుచుకుపడ్డారు. ఇలా అయితే కష్టమని కూడా అనేశారు.

మరోసారి లోతుగా సమీక్ష ...

విదేశీ పర్యటనలో పదిరోజులు గడిపిన బాబు వచ్చి రాగానే ఏపీలో పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం ఇంటింటికి తెలుగు దేశం పై సమీక్ష నిర్వహించారు. చాలారోజులుగా అమరావతికి దూరంగా ఉండటంతో పెండింగ్ పనులు ఉండిపోవడంతో లోతుగా పార్టీ కార్యక్రమాన్ని సమీక్షించే సమయం ఆయనకు లభించలేదు. దాంతో శనివారం పూర్తి స్థాయిలో ఈ అంశంపై దృష్టి పెడతా అని టెలీకాన్ఫెరెన్స్ కు ఏర్పాట్లు చేయమని బాబు ఆదేశించారు. చంద్రబాబు తమ నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించడానికి సిద్ధంగా ఉండటంతో తమ్ముళ్లు అలర్ట్ అయ్యారు. గత పదిరోజులుగా తమ తమ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలతో డేటా రెడీ చేసుకునే పనిలో బిజీ అయ్యారు. గత సమీక్షలో ఇంటింటికి కార్యక్రమంలో విజయవాడ మినహా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు సి గ్రేడ్ ప్రకటించిన బాబు ఇప్పుడు ఎన్ని మార్క్ లు వేస్తారో ఏ గ్రేడ్ ఇస్తారో అన్న టెన్షన్ పడుతున్నారు ఎమ్యెల్యేలు.

Similar News