తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కమ్మ కార్తీక సమారాధనలో చేసిన కామెంట్స్ చర్చనీయాంశం అవుతున్నాయి. గతంలో కూడా కమ్మ కార్తీక వనసమారాధనలో తుమ్మల ఇదే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఖమ్మం లో జరిగిన కార్తీక భోజనాల్లోనూ ఆయన ఇదే విధమైన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. మంత్రి హోదాలో వుంటూ కుల సమారాధనలో పాల్గొనడం అందులో తాము తప్ప ఇక ఏ కులం సూపర్ కాదన్నట్లు పేర్కొనడం సరి కాదన్న విమర్శలు సోషల్ మీడియా లో వైరల్ గా తిరుగుతున్నాయి. తుమ్మల పాత వీడియో వ్యాఖ్యలు తాజాగా చేసిన కామెంట్స్ పోస్ట్ చేసి అంతా ఆడుకుంటున్నారు.
ఆయన చెప్పింది నిజమేనా ...?
ఉదయం పాలప్యాకెట్, పేపర్ , కాఫీ హోటల్ , ఆసుపత్రి , స్కూల్ , సినిమా ధియేటర్, సినిమా హీరో , నిర్మాత, మీడియా, ఇలా ఏ రంగంలో చూసినా కమ్మ కులస్తులే లీడ్ చేస్తారు అంటున్నారు నెటిజెన్స్. రాజకీయ ప్రాతినిధ్యం తమ ఓటు బ్యాంక్ కి మించి పదింతలు ఉండటం తో కమ్మ సామాజిక వర్గం ఆర్ధికంగా బలపడిందని నెటిజెన్లు లెక్కలతో చెబుతున్నారు. రోజు బయటకు వచ్చి వందరూపాయలు ఖర్చు పెట్టే ప్రతి వారు 90 రూపాయలు కమ్మ వారు చేసే వ్యాపారాలకు చెల్లిస్తున్నారని గణాంకాలు అందించడం విశేషం. సామాజిక ఆర్ధిక అసమానతలు తొలగిపోవాలంటే అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం లభించాలని తుమ్మల కామెంట్స్ పై మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇలా రాజకీయం, వ్యాపారం, ఆర్ధిక స్థోమత తదితర అంశాలను కులాలవారీగా అంతా చర్చ మొదలు పెట్టేలా తుమ్మల కామెంట్స్ రచ్చకు దారితీయడం గమనార్హం.