ఎంపీలకు చంద్రబాబు ఏం చెప్పారంటే?

Update: 2018-03-13 04:04 GMT

ఆరోజు సెంటిమెంట్ కారణంగానే ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని, ఈరోజు సెంటిమెంట్ తో పనిలేదని బీజేపీ ఎలా చెబుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. నిధుల ఇవ్వడానికి సెంటిమెంట్ పనికిరాదనడం దారుణమన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన పార్టీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలను ఉధృతం చేయాలన్నారు. రైల్వేజోన్ ఇవ్వడం కుదరదని చెప్పడంపైన కూడా ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పార్లమెంటు బయట, లోపల ఆందోళన నిర్వహించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఐదోకోట్ల మంది ప్రజల గొంతుక విన్పించాలని కోరారు. పోరాటం నిర్మాణాత్మకంగా సాగాలన్నారు.

Similar News