కాంగ్రెస్ నాయకులంటే తనకు గౌరవమని, అయితే రాష్ట్ర విభజన సరిగా జరపలేదన్నదే తన బాధ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని, నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యే తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందన్నారు. ఉడుకునెత్తురుతో మరుగుతున్న యువత కావాలన్నారు. నల్లొండ సమస్య సమూలంగా రూపు మాపే వరకూ జనసేన పోరాటపడుతుంది. మన భాష, యాసను గౌరవించుకోవాలన్నారు. సమిష్టి కృషితో తెలంగాణను అభివృద్ధి పర్చుకోవాలన్నారు. సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోకుండా మార్పు తీసుకురాలేమన్నారు. స్థానిక సమస్యలను గుర్తించి తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అవినీతిపై రాజీలేని పోరాటాం చేస్తామన్నారు. విగ్రహారాధన కంటే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తనకు ఇష్టమన్నారు. జై తెలంగాణ అంటే ఒక సామాజిక మార్పుకు నిదర్శనమన్నారు. తనపై దాడిచేసినా...విమర్శించినా తాను పాజిటవ్ గానే తీసుకుంటానన్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యవస్థలో మార్పుకోసమే జనసేననున స్థాపించామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎలాంటి దాడులనైనా స్వీకరిస్తాననిచెప్పారు.