అదే సీన్ . అదే కధ. వేర్పాటు వాదులతో కలిసి యుద్ధం. చివరకు ఎన్ కౌంటర్ లో మృతి. 22 ఏళ్ల తర్వాత కాశ్మీర్ లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. తెలంగాణ యువకుడు కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించాడు. చనిపోయిన యువకుడు తమ టెర్రరిస్టు సంస్దలో పనిచేస్తున్నాడని ఐసిస్ ప్రకటించే వరకు కూడా నిఘా వర్గాలు పసిగట్ట లేక పోయాయి. ఐసిస్ చివరకు మృతుడి వివరాలతో పాటుఊరూ పేరును ప్రకటించడంతో నిఘా వర్గాలు ఒక్కసారి గా కళ్లు తెరిచి ఉగ్రవాది నిజ స్వరూపం తెలుసుకునే ప్రయత్నం ఆరంభించారు. అయితే మణుగూరు నుంచి రెండు సంవత్సరాల క్రితం కనపించ కుండా పొయిన మహ్మాద్ తౌఫిక్ ఇతను ఒక్కడే అన్న నిర్ధారణ కు పోలీసులు వచ్చారు. మణుగూరు కు చెందిన మహ్మద్ తౌఫిక్ రెండు సంవత్సరాల క్రితం మిస్ అయ్యాడు. .అతను సొషల్ మీడియా ప్రభావంతో ఉగ్రవాదంలో చేరి వుండాడని పోలీసులు అంటున్నారు. అయితే ఇతనితో పాటుగా ఇంకా ఎవరినైనా తీసుకుని వెళ్లాడా? అన్న కోణంలో కూడా నిఘా వర్గాలు పరిశీలిస్తున్నాయి.
ఎన్ కౌంటర్లో మరణించింది మనోడే....
అనంతనాగ్ జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ముగ్గురు అన్సార్ గజ్వతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాదుల్లో మహ్మద్ తౌఫీఖ్ అనే హైదరాబాదీ సైతం ఉన్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఉలిక్కిపడిన రాష్ట్ర నిఘా వర్గాలు ఈ తౌఫీఖ్ ఎవరో గుర్తించడానికి రికార్డులు తిరగేస్తున్నాయి. దక్షిణ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా హకూర ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ఆల్ ఖైదాకు చెందిన కాశ్మీర్ సెల్ ‘ఏజీహెచ్’ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించారు. ఈ టెర్రరిస్టుల్లో శ్రీనగర్‌లోని శౌర ప్రాంతానికి చెందిన ఈస ఫజిలి, అనంతనాగ్‌లోని కొకేర్‌నాగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ ఒవైస్ షఫీలతో పాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ తౌఫీఖ్ ఉన్నట్లు ఏజీహెచ్ అధికారిక మీడియా అల్–నసర్ ప్రకటించింది. ఏజీహెచ్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తున్న రెహాన్ ఖాన్‌కు తౌఫీఖ్ అత్యంత సన్నిహితుడిగా పేర్కొంది.
ఖమ్మం జిల్లాకు చెందిన....
2017లో హైదరాబాద్ నుంచి కాశ్మీర్‌కు వచ్చిన తౌఫీఖ్ ప్రస్తుతం ఏజీహెచ్‌లో కీలక స్థానంలో ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గడిచిన కొన్నాళ్ళుగా ఆల్ ఖైదా కాశ్మీర్‌లోనూ తన ప్రాబల్యం చూపడానికి ప్రాధాన్యం ఇస్తోంది. దీనికోసమే ప్రత్యేకంగా ఏజీహెచ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో కాశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌కు చెందిన వారు అనేక మంది రిక్రూట్ అయ్యారు. గతంలో ఇస్లామిక్ స్టేట్‌లో పని చేసిన వారు సైతం సిరియా పరిణామాల నేపథ్యంలో తమ బేస్‌ను కాశ్మీర్‌కు మార్చుకుంటూ ఏజీహెచ్‌లో చేరినట్లు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఏజీహెచ్‌కు చెందిన తౌఫీఖ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. గడిచిన కొన్నాళ్ళుగా హైదరాబాద్‌లో ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయని పోలీసు, నిఘా వర్గాలు భావిస్తున్నాయి. రెండేళ్ళ క్రితం ఇస్లామిక్ స్టేట్‌కు అనుబంధంగా ఏర్పడిన జేకేహెచ్, జేకేబీహెచ్ ఉగ్రవాద మాడ్యుల్స్‌ను పోలీసులు నిర్వీర్యం చేశారు. పలువురిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ చేసి విడిచిపెట్టాయి. ఇలా వదిలిన తౌఫిక్ నే ఉగ్రవాద బాట పట్టి వుంటారని పోలీసులు చెబుతున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు.....
తెలంగాణ పోలీసులను వెంటనే అప్రమత్తం చేయడంతో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా మిస్ అయ్యారన్న దానిపైన విచారణ చేశారు. హైదరబాద్ తోపాటుగా అన్ని జిల్లాల అధికారులను నిఘా సంస్థలు అప్రమత్తం చేశాయి. గత 2016 సంవత్సరం నుంచి మిస్ అయిన తౌపిక్ ఇప్పడు చనిపొయిన మహ్మాద్ ఒక్కడేనని తేలింది. మణుగూరు నుంచి కనిపించ కుండా పొయిన తౌఫీక్ ఎక్కడికి పొయాడు? .ఎవరితో కాంటాక్ట్ అయ్యాడు? అన్న దానిపైన పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం నిఘా వర్గాలు చేస్తున్నాయి. హైదరాబాద్ లో తౌఫిక్ ఎక్కడైనా స్టే చేశాడన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. దీనితో సొషల్ మీడియా ప్రభావంతో తౌఫిక్ వేర్పాటు వాదులతో చేతులు కలిపి వుంటారని పోలీసులు వర్గాలు అంటున్నాయి. అయితే ఇరవై ఏళ్లు క్రితం సైదాబాద్ లో నందరాజ్ ను చంపిన కేసులో నిందితుడు బషిర్ నాంపల్లి కోర్టు నుంచి తప్పించుకుని పొరిపొయాడు.. తరువాత బషిర్ కాశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో చనిపొవడం జరిగింది . అతను కూడా వేర్పాటు వాదులతో చేతులు కలిపాడు. అప్పడు జరిగిన ఎన్ కౌంటర్ లో బషీర్ చనిపొయడు. ఇప్పడు తౌఫిక్ కూడా ఇలాగే ఐసిస్ తో కలిసి పనిచేస్తూ మరణించాడు. అయితే హైదరబాద్ లో తౌఫిక్ కు ఎక్కడైన అడ్డా వుందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.