ఈసారి పొత్తుకు రాం రాం చెప్పేది కమలమేనా ... ?

Update: 2018-01-28 06:30 GMT

బిజెపి కట్ చేద్దామన్నా టిడిపి పైకి ఎన్ని చెప్పినా ఇప్పట్లో పొత్తు కట్ చేసుకోరు బాబు అంటున్నారు విశ్లేషకులు. కారణం లాలూ, శశికళ, ఆప్ లపై ఆల్ రెడి మోడీ శాంపిల్ చూపించడమే అని చెబుతున్నారు. మోడీతో పెట్టుకోవడానికి దేశంలో ప్రాంతీయ పార్టీలు గజ గజ వణుకుతున్నాయి. సిబిఐ ఓటుకు నోటు ఇలా చాలా అస్త్రాలు మోహమాటం లేకుండా బిజెపి వాడేస్తుందని లోలోపల టిడిపి అంతర్మధనం సాగిస్తోంది. ఏపీ సీఎం ను పిఎం మినహాయింపుగా తీసుకోరు.. అది తెలిసే ముడున్నారేళ్లుగా బాబు మౌనం వహిస్తున్నారనే రాజకీయ విశ్లేషకుల అంచనా.

బిజెపి అంటే భయం లేకపోతే ఈ పాటికే ...

టిడిపి కి ఈ భయాలు లేకపోతే ఈపాటికే కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి వుండే వారు. 2004 ఎన్నికల తరువాత గోద్రా అల్లర్లు చూపించి మైనార్టీ ఓటర్ల కోసం వాజపేయి పొత్తునే బాబు కట్ చేశారు. అలాంటిది రోజు తిట్టిన తిట్టు తిట్టకుండా పాయింట్ బ్లాంక్ రేంజ్ లో విమర్శలు ఆరోపణలు నేరుగా చేస్తున్న బిజెపిని నిన్నటి దాకా ఆయన నేరుగా పల్లెత్తు మాట అనలేని దుస్థితి టిడిపి అధినేతది. పార్టీ లోని కింది వారితో ఇప్పటి వరకు దాడి చేయించిన సైకిల్ పార్టీకి ఎప్పుడు ఎవరికి గాలి ఉందొ అది వాడేయడం వెన్నతో పెట్టిన విద్య . ఆయన పొత్తు పెట్టుకునేది పక్క పార్టీని మట్టానికి తొక్కేయడానికే అన్నది గతంలో లా కాకుండా బిజెపి ముందే పసిగట్టింది. ఎన్నికలు ఏడాది వుండగానే బాబు స్కూల్ తరహాలో బిజెపి స్టార్ట్ చేసింది. ఇప్పుడు బిజెపి బిగించే ఉచ్చు నుంచి ఆయన ఎలా బయట పడతారో చూడాలి. ఒక్కసారి సిబిఐ వంటి కేసుల్లో ఇరికిస్తే కేంద్రం లో ఏ ప్రభుత్వం వున్నా జీవిత కాలం ఆ కేసును చక్కగా వాడుకుంటుంది. ఏ మచ్చ లేనివారికే చుక్కలు చూపిస్తున్నారు మోడీ. మరి టిడిపితో ఆయన నేరుగా యుద్ధానికి దిగితే.

Similar News