కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఈరోజైనా లోక్ సభలో చర్చకు వస్తుందా? అన్నాడీఎంకే, టీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో ఎప్పటిలాగానే సభ వాయిదా పడుతుందా? ఇదే ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది. గత ఐదు రోజుల నుంచి అవిశ్వాస తీర్మానం నోటీసులను టీడీపీ, వైసీపీలు ఇస్తూనే ఉన్నాయి. సభ ఆర్డర్ లో లేదని చెబుతూ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను వాయిదా వేస్తూ వెళుతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని కీలక బిల్లులను ఆమోదించుకుంది. ఈరోజు అవిశ్వాసం చర్చకు వస్తుందని టీడీపీ, వైసీపీలు భావిస్తున్నాయి. నిన్న టీడీపీ ఎంపీలు స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలిసి అవిశ్వాస తీర్మానాన్ని చర్చకు వచ్చేలా చూడాలని కోరారు. అయితే స్పీకర్ మాత్రం సభ ఆర్డర్ లో లేకపోతే తాను ఎలా హెడ్ కౌంట్ చేయగలనని చెబుతున్నారు. అయితే ఈరోజుతో పార్లమెంటు సమావేశాలను నిరవధిక వాయిదా వేసుకుని వెళ్లే అవకాశముందని కూడా టీడీపీ, వేసీపీ నేతలు చెబుతున్నారు. మరికొద్దిసేపట్లో ఏం జరుగుతుందో చూడాలి. అవిశ్వాసంపై చర్చ జరుగుతుందా? లేక ఐదు రోజుల్లాగానే ఆరో రోజూ వాయిదా పడుతుందా? అనేది చూడాలి.