ఈయనగారి ఆస్తులు చూస్తే కళ్లు తిరగాల్సిందే...!

Update: 2018-02-10 02:30 GMT

హైదరాబాద్ మెట్రో పాలిటిన్ డెవలప్ మెంట్ ఆధారిటి అధికారుల అవినితి అనకొండ మాదిరిగా మారింది. అనకొండ ఆస్తులను చూసి అధికారులే విస్తుపోతున్నారు. ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని ముందే తెలుసుని ఇంటి నుంచి తన కుటంబం తో కలిసి పారిపొయాడు. ఇంటికి తాళాలు వేసి మరీ పరారయ్యాడు. తన బావమరిది కుటుంబంతో కలిసి హెచ్ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డిని పట్టుకునేందుకు ఏసీబీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు పారిపోతారన్న అనుమానంతోనే ఈ నోటీసులు జారీ చేశారు. పురుషోత్తం రెడ్డి పెద్దమొత్తంలో బినామీల కింద కోట్ల రూపాయలు పెట్టుబడి కొన్ని సంస్థల్లో పెట్టారని తెలుస్తోంది.

రెండొందల కోట్లుగా తేల్చిన ఏసీబీ...

ఇక పొతే పురుసొత్తం రెడ్డి ఆస్తుల చిట్టా చాలా వుంది. ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా ఆస్తులు వుంటాయని ఎసిబి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పురుషొత్తం రెడ్డికి చెందిన ఫామ్ హౌజ్ లతో పాటుగా పలు ఇండ్లను ఎసిబి సోదాలు చేసి స్వాధీన పరుచుకుంది. దీనితో పాటుగా కొన్ని చొట్ల రైడ్స్ చేసి ప్రాపర్టీస్ ను సీజ్ చేసింది. ఇవన్ని చేస్తున్న తరుణంలో ఎసిబి అధికారులకు మరొక కోణం బయట పడింది. పురుషొత్తం రెడ్డికి పెద్ద మొత్తంలో బినామీలు వున్నట్లుగా తెల్చారు. ప్రధానంగా రియల్ ఎస్టెట్స్ వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టిన్నట్లుగా తెలింది ఈమేరకు రెండు రియల్ ఎస్టెట్స్ సంస్దలో 30 కోట్లు పెట్టుబడులు పెట్టారని కనుగొన్నారు. వీరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

బినామీలతో ఘరానా వ్యవహారం.....

ఇదిలా వుంటే పురుషొత్తం తన ఆధికారాన్ని ఉపయోగించుకుని చాల మంది బినామీలను ఎర్పాటు చేసుకున్నారని ఏసీబీ చెబుతుంది. ఈ బినామీల చిట్టాను మొత్తం కూడా త్వరలోనే బయట పెడతామని ఎసిబి చెబుతుంది. ఇదిలా వుంటే పురుషొత్తం రెడ్డి ఆస్తులు దాదాపుగా రెండు వందల కోట్లకు పైగా వుంటుందని ఎసిబి అనుమానిస్తుంది. అతని ఇండ్లతో పాటుగా బావమరిది శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సొదాలు చేసినట్లయితే మరిన్ని వివరాలు బయట పడుతాయని ఎసిబి భావిస్తుంది. పరారీలో వున్న పురుషొత్తం రెడ్డిని పట్టుకునేందుకు ఎసిబి ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. పురుషొత్తం రెడ్డి లొంగి పొతే మంచిదని లేని పక్షంలో చర్యలు తీవ్రంగా ఉంటాయని ఎసిబి తెలిపింది. ఇదిలా వుంటే ఎసిబి సొదాలకు సంబంధించి ముందస్తు సమాచారం పురుషొత్తం రెడ్డికి ఎలా తెలిసిందన్న కోణంలో కూడా శాఖ^పరమైన విచారణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎసిబితో పాటుగా అన్ని శాఖల్లో కూడా పురుషొత్తం రెడ్డికి అనుచరులు వున్నారని. ఎవరొక ఒక్కరు ఈ సమాచారంను ఇచ్చి వుంటారని ఎసిబి అనూమానిస్తుంది. ఎది ఎమైన కూడా రెండు వందల కొట్లుకు పైగా ఆస్తులు వున్న ఆనకొండ పురుషొత్తం రెడ్డి చిక్కితే గాని అన్ని వివరాలు బయటకు రావని అంటున్నారు అధికారులు

Similar News