ఈ బెగ్గర్స్ కోటీశ్వరులు...!

Update: 2017-11-21 11:33 GMT

ఇది సినిమా ను తలపించే యథార్ధ గాధ గతంలో వచ్చిన బిచ్చగాడు సినిమాను మాదిరిగానే... నిజ జీవితంలోనూ జరిగిన రియల్ స్టోరీ ఇది....మీకు బిచ్చగాడు సినిమా గుర్తుంది కదా... ఓ కోటీశ్వరుడు అమెరికాలో చదువుకుని.. మంచి ఉద్యోగంలో స్థిరపడి పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహిస్తూ ఇండియాలో తన తల్లి నిర్వహిస్తున్న వ్యాపారాలను చుసుకుంటుండగా తన తల్లి ప్రమాదవశాత్తు కోమాలోకి వెళ్తుంది.. ఆ కొడుకు తల్లిని బ్రతికించడం కోసం బిక్షగాడిగా మారాలని ఓ సాధువు చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుని ఆ కోటీశ్వరుడు బిక్ష గాడిలా మారుతాడు.సేమ్ అదే సీన్ హైదరాబాద్ లో కనిపించింది...అది ఏమిటో తెలియాలంటే అంతర్జాతీయ సదస్సును ఈ నెల 28,29.30 తేదీలలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్న నేపధ్యంలో ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు కూతరు ఇవాంకా ట్రంప్ రానున్న నేపధ్యంలో నగరంలో ఉన్న బిక్షగాళ్లందరి పై పోలీసులు ఆంక్షలు పెట్టి వారందరిని చర్లపల్లిలో ఉన్న ఆనంద ఆశ్రమానికి తరలిస్తున్నారు....అక్కడే పోలీసులకు అసలు విషయం తెలిసింది..కోటీశ్వరులు కూడా తప్పని పరిస్థితుల్లో బిక్షాటన చేస్తున్నారని తేలింది... ఒక్కొక్క యాచకులను కదిలిస్తుంటే వారి జీవితాల్లో కన్నీటీ గాధలు బయట పడుతున్నాయి.

కోటీశ్వరురాలు అయినా....

ఆ మహిళ పేరు ఫర్జోనా (50) లంగారాహౌజ్ లో బిక్షాటన చేస్తుండగా ఈమెను పోలీసులు చర్లపల్లిలో ఉన్న ఆనంద ఆశ్రమానికి తరలించారు...అక్కడ ఆమె వివరాలు నమోదు చేసుకున్న పోలీసులు ఒక్క సారిగా అవాక్కయ్యారు...ఎంబిఏ చదువుకున్న ఫర్జోనా లండన్ లో అకౌంట్ ఆఫీసర్ గా విధులు నిర్వహించింది..రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడం తో జీవితంలో అనేక ఒడిదుడుకులు మెుదలైయ్యాయి..భర్త చనిపోయాక ఆనంద్ బాగ్ లో ఉంటున్న తన కొడుకు దగ్గర కొన్నాళ్లు జీవనం సాగించింది ఫర్జోనా.అయితే జీవితంలో ఎదురైన ఇబ్బందులు ఆమెను మనోవేదనకు గురి చేశాయి. వాటి నుండి ఉపశమనం పొందేందుకు ఆనారోగ్యం నుండి బయట పడేందుకు యాచకురాలిగా మారాలని తన కొడుకు సూచించాడు..దీంతో లంగార్ హౌజ్ లో బిక్షాటన చేస్తున్న ఫర్జోనా ను ఇటీవల పోలీసులు ఆనంద ఆశ్రమానికి తరలించారు....ఆనంద ఆశ్రమంలో ఉంటున్న సహచరులతోనూ,పోలీసు అధికారులతోనూ ఇంగ్లీషులోనే మాట్లాడేది ఫర్జోనా.విషయం తెలుసుకున్న ఆమె కూమారుడు అఫిడవిట్ ధాఖాలు చేసి ఫర్జోనా ను ఇంటికి తీసుకువెళ్లాడు.

బంధువులే రాబందులై....

ఇక మరో మహిళ కూడా అదే పరిస్థితి. ఈమె పేరు రబియా బసీరా. అమెరికాలో పనిచేసిన ఈమె గ్రీన్ కార్డు హోల్డర్. తప్పని పరిస్థితుల్లో ఓ దర్గా దగ్గర యాచకురాలిగా మారింది..నిజానికి రబియా బసీరా కోటీశ్వరురాలు హైదరాబాద్ లో పెద్ద బిల్డంగ్ కూడా ఉంది,కానీ తన దగ్గర ఉన్న కుటుంబ సభ్యులే రబియా బసీరా ను మోసం చేసి ఆస్తిని లాక్కోవడంతో పోట్ట కూటికోసం పట్టెడన్నం కోసం తప్పని పరిస్థితుల్లో యాచకురాలిగా అవతారం ఎత్తింది రబియా బసీరా.ఇక విషయం తెలుసుకున్న రబియా బసీరా బంధువులు ఆమెకు సంబందించిన పత్రాలను సమర్పించి రబియాను ఇక నుండి జాగ్రత్తగా చూసుకుంటామని పోలీసులకు చెప్పి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆనంద ఆశ్రమంలో ఉన్న యాచకులను ఒక్కోక్కరిది ఒక్కోక్క గాధ. ఎవరిని కదిలించినా వారి వెనుక జరిగిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి...ఇలాంటి వారు ఇంకా ఆశ్రమంలో అనేక మంది ఉంటారని పోలీసులు చెప్తున్నారు...ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఇలా మారడం నిజంగా దురదృష్టకరమే..ఇక నుండి ఇలాంటి పరిస్థితి మరెవ్వరికి రాకుడదని ఆకాంక్షిద్దాం.

Similar News