ఈ జిల్లా జగన్ కు దెబ్బేయనుందా?

Update: 2017-10-09 11:30 GMT

విజయనగరం జిల్లా వైసీపీకి తలనొప్పిగా మారింది. నేతలకు కొదవలేదని ఆనంద పడాలో.... సీనియర్ నేతల విభేదాలతో నిరాశపడాలో తెలియని పరిస్థితి జగన్ ది. విజయనగరం జిల్లాలో వైసీపీకి నేతలు పుష్కలంగా ఉన్నారు. దాదాపు సీనియర్ అందరూ సీనియర్ నేతలే. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే జిల్లాలో వైసీపీకి తిరుగుండదు. కాని నేతల మధ్య సమన్వయం లేదు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తుంటారు. దీంతో ఆ జల్లా వైసీపీని కొంపముచ్చేటట్లుగానే కన్పిస్తోంది. విజయనగరం జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది బొత్స సత్యనారాయణ. బొత్స కాంగ్రెస్ నుంచి నేరుగా వైసీపీలోకి చేరారు. దీంతో విజయనగరంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావించారు. కాని రానురాను బలహీనపడటం వైసీపీ అధిష్టానాన్ని ఆందోళన కల్గిస్తోంది.

సీనియర్ నేతలున్న చోట......

బొత్స సత్యనారాయణ సీనియర్ లీడర్. ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందే. కాని ఇతర నేతల నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోకూడదు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు కూడా పార్టీని వీడి వెళ్లింది బొత్స మితి మీరిన జోక్యం వల్లనేనన్న ఆరోపణలున్నాయి. తాజాగా సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్ర స్వామి జిల్లా పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. ఆయన జగన్ కు లేఖ కూడా రాశారు. కొలగట్ల వీరభద్రస్వామి ఇటీవలే ఒక ప్రకటన కూడా చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. తాజాగా సమన్వయ కర్త పదవికి కూడా రాజీనామా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే జగన్ కు రాసిన లేఖలో తనకు బొత్స అంటే వ్యతిరేకత ఏమీ లేదని చెప్పడం కొసమెరుపు. దీన్ని బట్టి చూస్తుంటే కొలగట్ల పార్టీ మారతారేమోనని అనిపిస్తోంది. మొత్తం మీద విజయనగరం జిల్లాలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పెద్ద దెబ్బే పడేటట్లుంది.

Similar News