ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ ను వదలరట...!

Update: 2017-11-30 06:13 GMT

తన ప్రాణం ఉన్నంత వరకూ వైసీపీలోనే ఉంటానని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిచెప్పారు. శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ పాదయాత్ర కు వస్తున్న స్పందన చూసి ఓర్వ లేక టీడీపీ తన పేరును కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయిస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ఆరపణలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆయన కోరారు. అలాగే నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కూడా స్పందించారు. తాను వైసీపీని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగేది లేదని ప్రతాప్ అప్పారావు స్పష్టం చేశారు. జగన్ ను తాను కలవాలంటే ఏరోజూ గంటల తరబడి వేచిచూడలేదని, వెంటనే కలిసి మాట్లాడి వచ్చేసేవాడినని ఆయన తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ఆయన మండిపడ్డారు. ఎవరైతే తనపై ఆరోపణలు చేస్తున్నారో వారు తమ వద్దకు వస్తే తన వివరణ ఇస్తానని అప్పారావు తెలిపారు.

Similar News