అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ఈ రోజు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఇవాంక పాల్గొన్నారు. ఈ రోజు అంతా హైదరాబాద్‌లో ఇవాంకా సందడే నెలకొంది. ఇక సాయంత్రం ఇవాంకాకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అదిరిపోయే విందు ఇవ్వనున్నారు. ఇవాంకకు ఇచ్చే విందుకోసం తాజ్ పలక్‌నామా విద్యుద్దీపాల కాంతులతో మెరిపిసోతోంది. సాయంత్రం తాజ్ పలక్‌నామాలో జరిగే ఈ విందు కోసం పలక్‌నామాలో 108 అడుగుల భారీ టేబుల్ ఏర్పాటు చేశారు.
101 మంది ఒకేసారి....
ఈ టేబుల్ మీద ఒకేసారి 101 మంది విశిష్ట అతిథులు కూర్చొని భోజనం చేయవచ్చు. ఇవాంకాతో పాటు పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరుకానున్నారు. ఇక ఇవాంక కోసం అదిరిపోయే ఐటెమ్స్ రెడీ అయ్యాయి. మొత్తం 100కు పైగా రకాలతో ఈ విందు జరగనుందని తెలుస్తోంది. కేవలం 15 రకాల బిర్యానీలే మెనూలో ఉన్నాయి. వీటిల్లో మెఘలాయ్ దమ్ బిర్యానీ, మెఘలాయ్ మటన్, డ్రైఫూట్స్, హలీం, కబాబ్, దమ్ కా బిర్యానీ, మరగ్, మటన్ కాఫ్తా, నాన్ రోటీ, ఖుర్బానీ కా మిఠా, చికెన్‌తో పాటు నార్త్, సౌత్ ఇండియన్ వంటకాలతో పాటు అమెరికా, ఇటాలియన్ రుచులను కూడా ఇవాంకా విందులో వడ్డించనున్నారు.
పసందైన రుచులతో....
ఓవరాల్‌గా ఇవాంకాకు ఇచ్చే విందు పసందైన రుచులతో అదిరిపోనుంది. ఇక ఈ వంటలు చేసేందుకు దేశ, విదేశాల నుంచి 30 మంది వంటలో ప్రావీణ్యం ఉన్న వంటగాళ్లను హైదరాబాద్‌కు పిలిపించారు. ఇక ఈ మెనూ గురించి చర్చించేందుకే గంటకు పైగా టైం పడుతుందంటే మెనూలో ఎలాంటి ఐటెంలు ఉన్నాయో ? అర్థం చేసుకోవచ్చు.