ఇవాంకానా...? మజాకా.. ?

Update: 2017-11-19 16:30 GMT

అమోరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు హైదరబాద్ కు వస్తున్నారు. ఈ విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం రెడ్ కార్పెట్ ను సిద్ధం చేసింది. దీనికి తోడుగా బిక్షగాళ్లు లేకుండా చేసింది. బిక్షగాళ్లు కనబడితే చెప్పండి బహుమతుల ఇస్తామని కూడా ప్రకటించింది. ఇక్కడి వరకు బెగ్గర్ ఫ్రీ చేయడానికి ఇది మంచి తరుణం .. అయితే ఇప్పడు ఇవాంకా రాక తో అధికారులకు కొత్త కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయి.. అంతర్జాతీయ సదస్సులో ఇవాంకాతో పాటుగా మన దేశ ప్రధాని కూడా పాలుపంచుకుంటున్నారు. అయితే మన దేశ భద్రత దేవుడెరుగు కాని ఇవాంకా సెక్యూరిటి ఇప్పడు చర్చనీయాంశంగా మారింది.. ఎందుకంటే ఇవాంకా పాల్గొనే వేదికతో పాటుగా ఆమె విడిది చేసే ఫలక్ నూమా ప్యాలెస్ సెక్యూరిటిపైనా ఇప్పడు అధికారులు చర్చలు జరుపుతున్నారు.అమెరికా ఫెడరల్ సెక్యూరిటి ఇప్పటికే ఈ రెండిండిని స్వాధీన పరుచుకుంది. పది రోజుల ముందు నుంచే ఈ రెండింటికి సంబంధించిన అన్ని వివరాలు తమకు అందించాలని..దానితో పాటుగా ఇక్కడ పది రోజుల నుంచి ఇక్కడ జరిగే అన్ని సదస్సుల వివరాలను తమకుఇవ్వాలని పెడరల్ సెక్యూరిటి అధికారులు అడిగారు.

సెక్యూరిటీ టైట్.....

దీనికి తోడుగా ఫలక్ నూమా ప్యాలెస్ లో పది రోజుల ముందు నుంచి విడిది చేసే అందరి వివరాలను తమ అందించాలని కూడా కోరారు. ఇవాంకా స్టే చేసే సూట్ ను ఇప్పటికే అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనికి తోడుగా ఈ సూట్ కు అధునాతమైన సెన్సార్లను ఫెడరల్ సెక్యూరిటి సిబ్బంది అమరుస్తున్నారు. అదే విధంగా ప్యాలెస్ లో పనిచేస్తున్న సిబ్బంది సంబంధించిన వివరాలను కూడా వీరు సెకరించి పెట్టుకున్నారు. ఎవరిమీదనైనా అనుమానం ఉన్నట్లు అయితే అలాంటి వారికి స్వస్తి చెప్పాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారట. అదే విధంగా తమకు ఇండియా ప్రధాని తో సంబంధం లేదని, తమ అధ్యక్షుడి కూతురు సెక్యూరిటినే ముఖ్యమని మన అధికారులకు తేల్చి చెప్పినట్లుగా సమాచారం . అదే విధంగా ఇవాంకా , మోడిలు కలిసి పాల్గొనే మీటింగ్ లకు సంబంధించిన వివరాలను పూర్తిగా గోప్యంగా పెట్టారు. ఇవాంకా సిటీలో పర్యటించే అవకాశం కూడా ఉన్నట్లుగా గా సమాచారం. ముఖ్యంగా గొల్కొండ కోటతో పాటుగా ఛార్మినార్ , చుడి బజార్ లను కూడా ఇవాంకా సందర్శించే అవకాశం వున్నట్లుగా సమాచారం. ఎది ఎమైనా ఇవాంకా సిటీ టూర్ అధికారులకు ముందు నుంచి ముచ్చెమటలు పడుతున్నాయి.

Similar News