ఇవాంకా విందు మెనూ అదిరిందే....!

Update: 2017-11-25 05:30 GMT

ట్రంప్ కూతురు ఇవాంకా హైదరాబాద్ లోకి రెండు రోజుల్లో కాలుమోపుతున్నారు. ఆమెకు ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు ఇవ్వనున్నారు. ఇవాంకాతో పాటు ప్రధాని మోడీ, దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ లో పాల్గొననున్నారు. అయితే ఇవాంకా కోసం హైదరాబాద్ స్పెషల్స్ అన్నీ రెడీ చేసేస్తున్నారు. ఆమెకు హైదరాబాదీల వంటకాలన్నీ రుచి చూపించేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అవుతుంది. ఇవాంకా మెనూలో కేవలం తెలంగాణకు చెందిన 30 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ ధమ్ కీ బిర్యానీ ఇందులో స్పెషల్. అంతేకాకుండా ఖుర్బానీ కా మీఠా స్వీట్ వెరీ వెరీ స్పెషల్. వీటితో పాటు నాటుకోడి కూర, చేపల ఇగురు, మటన్ కూర్మా వంటివి ప్రత్యేకంగా చేస్తున్నారు. వీటితో పాటు అమెరికా స్టాటర్స్ ను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇవాంకాకు వండి పెట్టేందుకు ఇప్పటికే అమెరికా నుంచి ఆరుగురు ప్రత్యేక వంట సిబ్బంది దిగిపోయారు.

ఇవాంకా బహుమతులు ఎన్నో.....

ఫలక్ నుమా ప్యాలెస్ లో ఇవాంకాకు వండి వార్చి పెట్టే వంటలను అమెరికా నుంచి వచ్చిన స్టాఫ్, భద్రత సిబ్బంది రుచి చూశారు. వారు ఓకే చెప్పిన తర్వాతనే రేపు ఇవాంకాకు ఆ వంటకాలు వండి పెట్టాల్సి ఉంటుంది. ఇక ఇవాంకా కోసం కేసీఆర్ స్పెషల్ గిఫ్ట్ ను రెడీ చేశారు. ఇవాంకా కోసం పోచంపల్లి చీరను ప్రత్యేకంగా నేయించారు. దీనివల్ల చేనేత పరిశ్రమకు మరింత పేరు వస్తుందని భావిస్తున్నారు. ఇవాంకా చీరతోనే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులోగాని, డిన్నర్ లోగాని పాల్గొనే అవకాశముంది. ఇవాంకా ఏ దేశం వెళ్లినా అక్కడి సంప్రదాయ దుస్తులు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. కొన్నాళ్ల క్రితం జపాన్ పర్యటించినప్పుడు అక్కడి సంప్రదాయ వస్త్రాలను ఇవాంకా ధరించారు. ఇవి కాకుండా ఇవాంకాకు ప్రత్యేకంగా కేసీఆర్ డైమెండ్ నెక్లెస్ ప్రెజెంట్ చేయనున్నారు. అలాగే హైదరాబాద్ గాజులను, చార్మినార్ వెండి బొమ్మను కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాంకాకు బహుకరించనున్నారు. అలాగే ప్రధాని మోడీకి కూడా ప్రత్యేకంగా తయారు చేయించిన చేనేత వస్త్రాలను కేసీఆర్ బహుమతిగా ఇవ్వనున్నారు.

Similar News