ఇవాంకా వచ్చేస్తున్నారు... పారాహుషార్...!

Update: 2017-11-27 02:31 GMT

ఈ నెల 28వ తేదీన జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర పోలీస్ శాఖ. సమ్మిట్ జరుగుతున్న హెచ్ఐసీసీతో పాటు ఫలక్ నుమా ప్యాలెస్, గోల్కొండ కొండల్లో హై సెక్యూరిటీతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు మన పోలీసులు. ఇప్పటికే ఈ మూడు ప్రాంతాలు యూ.ఎస్ సీక్రెట్ సెక్యూరిటీ ఏజెన్సీ నిఘా నీడలో ఉండగా.....10చ400 మంది పోలీసులు మూడు రోజులు బందోబస్తు నిర్వహించనున్నారు.

భద్రతను మరింత పెంచిన....

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ సెక్యూరిటిని ఛాలెంజ్ గా తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. 180 దేశాలకు పైగా విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్న ఈ మూడు రోజుల వ్యాపార భాగస్వామ్య సదస్సులో ఎక్కడా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 10400 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో 7500 మంది సివిల్, ట్రాఫిక్ పోలీసులు కాగా 60 ప్లాటూన్ల కేంద్ర బలగాలు, 4 యూనిట్ల గ్రే హౌండ్స్, 2 యూనిట్ల ఆక్టోపస్,700 మంది సీఎస్ డబ్ల్యూ పోలీసులతో పాటు 50 డాగ్ స్క్వాడ్ టీంలు ఉన్నాయి. అయితే ప్రధాని ఇవాంకా టూర్ ఫైనల్ అయిన రోజు నుండి సిటీలోని అన్ని అనుమానాస్పద ప్రాంతాలను జల్లెడ పట్టిన పోలీసులు....అతికీలకమైన ఈ మూడు రోజులు పక్కా ప్రణాళికతో సెక్యూరిటీ ఏర్పాట్లు చేసారు.

11 మంది సీనియర్ ఐపీఎస్ లకు.....

అందుకోసం ప్రత్యేకంగా 11 మంది ఐపీఎస్ అధికారులకు కీలక భాద్యతలు అప్పగించారు. ఇందులో ఎల్లుండి తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చే ఇవాంకా ట్రంప్ మూవ్ మెంట్స్ అత్యంత సీక్రెట్ గా ఉంచారు. ఆమె ఎయిర్ పోర్ట్ లో ల్యాండై అక్కడి నుండి హెచ్ఐసీసీ కి చేరుకునే వివరాలను రహస్యంగా ఉంచారు. దీంతో పాటు ఇప్పటికే ఖరారైన ప్రధాని మోదీ టూర్ తో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల్లో హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేసారు పోలీసులు. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న పీఎం స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్.... ప్రధాని విమానం ల్యాండ్ అయ్యే ప్లేస్ తో పాటు హెలిక్యాప్టర్ టేక్ ఆఫ్ అయ్యే రన్ వే లను పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.10 నిమిషాలకు బేగంపెట్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తరువాత ఇక్కడ 15నిమిషాల పాటు పార్టీ శ్రేణులతో భేటి అవుతారు మోదీ. అందు కోసం ప్రిపేర్ చేసిన కార్యకర్తల వివరాలు సేకరించిన ఎస్పీజీ ...పార్టీ శ్రేణులకు నిర్ధారించిన ప్రాంతంలో బారికేడ్స్ ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించింది. అనంతరం ప్రత్యేక హెలిక్యాప్టర్ లో మియాపూర్ చేరుకుని అక్కడ మెట్రో రైల్ ను ఆవిష్కరిస్తారు ప్రధాని. బేగంపేట్ చేరుకున్నాక 40 నిమిషాలు మోడీ ఇక్కడే ఉండే అవకాశాలున్నాయాని అంటున్నారు సిటీ పోలీసులు.

ప్రధాని పర్యటనలో కూడా...

మెట్రో రైల్ ప్రారంభం తరువాత హెచ్ఐసీసీ లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్ కు హాజరౌతారు మోదీ. ఈ సమ్మిట్ లో ప్రధాని మోదీ,సీఎంతో పాటు ఇవాంకా ట్రంప్, డెలిగేట్స్ పాల్గొంటున్నారు. తర్వాత బేగంపెట్ ఎయిర్ పోర్ట్ కి ప్రధాని చేరుకుంటారు.ఈ సమ్మిట్ లో పాల్గొనేందుకు వచ్చిన డెలిగేట్స్ కోసం 21హోటళ్ళలో బస ఏర్పాట్లు చేసామన్నారు డీజీపీ మహేంధర్ రెడ్డి. అయితే ఓ వైపు ప్రధాని మరో వైపు ఇవాంకా టూర్ లతో కామన్ మెన్ కు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కాన్వాయ్ ఏర్పాట్లు చేసామంటున్న డీజీపీ....ఫలక్ నుమా ప్యాలెస్, శంషా బాద్ ఎయిర్ పోర్ట్ లకు పీవీ ఎక్స్ ప్రెస్ హైవే, అవుటర్ రింగ్ రోడ్డు రూట్లను ఎంచుకున్నామని అన్నారు. 28వ తేదీ రాత్రి ఫలక్ నుమాలో డిన్నర్ తరువాత 29న డెలిగేట్స్ కి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆతిధ్యం ఉందని అన్నారు డీజీపీ. ఇవాంకా ట్రంప్ తో పాటు డెలిగేట్స్ కి ఫలక్ నుమా ప్యాలెస్ లోప్రధాని విందు నేపథ్యంలో...ప్యాలెస్ చుట్టూ 520 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.

Similar News