అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. నవంబరు 28న తెల్లవారుజామున 3.30కి ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఇవాంకా చేరుకోనున్నారు. ఆమె వెంట ప్రైవేట్ కమర్షియల్ ఫ్లైట్ లో వందమంది ప్రతినిధులు రానున్నారు.శంషాబాద్ నుంచి రోడ్డు మార్గంలో మాదాపూర్ లోని వెస్టిన్ హోటల్ కు చేరుకుని అక్కడ బస చేయనున్నారు. ఉదయం 9.30గంటలకు హెచ్ఐసీసీలో ప్రతినిధులతో ఇవాంకా సమావేశమవుతారు. సాయంత్రం 4.30 అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొననున్నారు. వేదిక మీద ముగ్గురికే చోటుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ, ఇవాంకా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే వేదిక మీద ఆశీనులవుతారు. సమావేశం ముగిసిన తర్వాత మాదాపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫలక్ నుమా ప్యాలెస్ కు వస్తారు. సాయంత్రం ఫలక్ నుమా ప్యాలెస్ లో మోడీతో కలిసి డిన్నర్ లో పాల్గొంటారు. ఒక గంట ఫలక్ నుమా ప్యాలెస్ లోనే ఉంటారు.