ఇవాంకా తొలి పలుకులివే...!

Update: 2017-11-28 12:04 GMT

‘భారత్ నిజమైన స్నేహితుడని ట్రంప్ చెబుతుంటారు. ప్రజాస్వామ్య విజయానికి భారత్ ఆశాదీపంగా ఉంది. మార్పు సాధ్యమని మోడీ నిరూపించారు. ఇన్నోవేషన్ హబ్ గా హైదరాబాద్ ఎదుగుతోంది. భారత్ ను పేదరికాన్ని బయటపడేసేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. గత సదస్సుకు నేటి సదస్సుకు మహిళ పారిశ్రామిక వేత్తల భాగస్వామ్యం పది శాతం పెరిగింది. ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. భారత రాకెట్ టెక్నాలజీ మార్స్ దాకా వెళ్లింది. అమెరికాలో కోటి పదిలక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. భారతీయులు అందరికీ స్ఫూర్తిదాయకం. టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానిగా ఎదిగిన మీ ప్రస్థానం అద్వితీయం. కొత్త ఆవిష్కరణలకు ముందుకు వస్తున్న యువతకు స్వాగతం. భారత ప్రజలు మా అందరికి స్ఫూర్తికలిగించారు. ఆసియాలోనే అతిపెద్ద ఇంక్యుబరేటర్ గా టీ హబ్ తయారైంది. ఈ సదస్సులో పాల్గొనడం సంతోషంగా ఉంది. నా పిల్లల్ని హైదరాబాద్ స్కూళ్లకు పంపించాలని ఉంది.మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను తయారుచేసింది హైదరాబాద్. టెక్నాలజీలోనే కాదు బిర్యానీలో కూడా ఎదిగారు. ఈ సదస్సు ఎన్నో ఆలోచనలకు వేదిక అవుతుందని ఆశిస్తున్నా’ అని ఇవాంకా ప్రసంగించారు.

Similar News