అమెరికా అధ్యక్షుడు కూమార్తె మరో ఐదు రోజుల్లో హైదరబాద్ లో అడుగు పెట్ట బోతున్నారు. ఇవాంకా ట్రంప్ వస్తున్న నేపథ్యంలో సెక్యూరిటీని టైట్ చేశారు. ఇవాంకా బస చేసే హోటల్స్ పైన ఇప్పుడు అందరి ఫోకస్ వుంది. ఇవాంకా ఎక్కడ వుంటారు? నైట్ ఎక్కడ స్టే చేస్తారు? ఎక్కడ భోజనం చేస్తారు..? ఎక్కడ మీటింగ్ లో పాల్గొంటారు? ఇవాంకా స్టే చేసే ప్రాంతాలన్నింటినీ పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఎవరినీ ఇవాంకా స్టే చేసే హోటల్ వైపు అనుమతించడం లేదు.
అడ్వాన్స్ టీమ్....
అమెరికా అధ్యక్షుడు కూమార్తె రాక కోసం హైదరాబాద్ ఎదురు చూస్తుంది. మరో ఐదు రొజుల్లో ఇవాంకా వస్తుండటంతో అందరిలో ఒక్కటే టెన్షన్ మొదలైంది. ఇవాంకా అడ్వాన్స్ సెక్యూరిటి టీమ్ కూడా ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకుంది. ఫెడరల్ సెక్యూరిటి అధికారులు ఇప్పటికే నగరంలో మకాం వేశారు. హైదరాబాద్ లో జరిగే పరిణామాలను ఎప్పటికప్పడు బేరీజు వేసుకుంటూ నివేదికలను అమెరికాకు పంపిస్తున్నారు. ఇవాంకా టూర్ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతను పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు.
ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా...
శంషాబాద్ ఎయిర్ పొర్టులో ఇవాంకా ట్రంప్ ల్యాండ్ అవుతారు . అక్కడి నుంచి నేరుగా ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మాదాపూర్ లోని రహెజా మైండ్ స్పేస్ లో వున్న వెస్టీస్ హోటల్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి హెచ్ఐసిసి లో జరిగే మీటింగ్ లో పాల్గొంటారు. అయితే ఇవాంకా స్టే చేసే హొటల్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మొత్తం నాలుగు అంతస్తులను ఇవాంకాతో పాటుగా వచ్చిన వారి కోసం సిద్ధం చేస్తున్నారు. పన్నెండో అంతస్తులో ఇవాంకా స్టే చేయబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఫెడరల్ బ్యూరో అధికారులతోపాటు ఇంటలిజెన్స్ అధికారులు ఈ నాలుగు అంతస్తులను చెక్ చేయడం జరిగింది. అత్యాధునికమైన గ్యాడ్జెట్స్ ను ఇప్పటికే అమర్చారు. చీమ చిటుక్కుమన్నా తెలిసి పోయే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి పేరుగాంచిన ఈ హోటల్ కు ప్రతినిత్యం కూడా వందలాది మంది వచ్చి పోతుంటారు. ఈ హోటల్ చుట్టు పక్కల ఏరియాలో అన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు వుండగా.. మరో వైపు రెసిడెన్జియల్ కాంప్లెక్స్ వుంది. ఇక పోతే హోటల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొత్త వారు ఎవరినీ రానివ్వడం లేదు. ఎవరైనా వచ్చినా వారి వివరాలను సేకరిస్తున్నారు. హోటల్ లోని అన్ని గేట్ల వద్ద సెక్యురిటీన పెంచారు. అనుమతి లేకుండా ఆ రోడ్డు నుంచి కారును కూడా పంపరు. రహేజా మైండ్ స్పేస్ లో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని పోలీసు అధికారులు సాఫ్ట్ వేర్ కంపెనీలకు సూచించారు.