ఇళ్ల పేరుతో దోచుకున్నారు

Update: 2016-12-27 07:31 GMT

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్లపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన ఈరోజు అసెంబ్లీలో మాట్లాడారు. గత ప్రభుత్వాల ఇళ్ల పేరుతో అవినీతికి పాల్పడ్డాయని, లక్షా 96 వేల మంది అనర్హులు ఇళ్లు పొందారని కేసీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లలో రాజకీయ జోక్యం లేకుండా చూస్తామన్న ఆయన అందుకోసమే ఇన్ చార్జి మంత్రి, ఎమ్మెల్యే కోటాను ఇళ్ల మంజూరు నుంచి తొలగించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో పెద్ద యెత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. పాలకులు, అధికారులు ఏకమై దోచుకున్నారని ధ్వజమెత్తారు. అందుకోసమే ఇళ్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 2.60 లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేశామని, అవి ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం లక్షల్లో దరఖాస్లు వచ్చాయని, వాటిని పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు.

Similar News