ఇద్దరూ అజ్ఞాతవాసికి జై కొట్టేశారు ..!

Update: 2018-01-10 02:30 GMT

ఇప్పుడు జనసేన అధినేత స్టార్ హీరో అవసరం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు బాగా వుంది. అందులోను పవన్ ఇటు టిడిపి అటు టిఆర్ ఎస్ ప్రభుత్వాలకు బ్రాండ్ అంబాసిడర్ మాదిరి చేసిన వ్యాఖ్యలు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. సాధారణంగా అర్ధరాత్రి షో ప్రత్యేక షో లకు అభ్యంతరాలు తెలిపే ప్రభుత్వాలు ఇప్పుడు పవన్ అజ్ఞాతవాసికి మాత్రం నిబంధనలు ఎత్తేశాయి. వడ్డించేవాడు మనవాడు అయితే చాలన్న సామెత చందంగా జనసేనాని కొత్త సినిమా అజ్ఞాతవాసి కి ఇప్పుడు అడ్డంకులు అన్ని తొలగిపోయాయి.

కేసీఆర్ పవన్ రుణం తీర్చేశారు...

ఇటీవలే టి సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ పధకాన్ని ఆకాశానికి ఎత్తేసిన పవన్ కళ్యాణ్ గులాబీ బాస్ కరుణ కటాక్షాలను ఇప్పుడు ప్రతిఫలంగా అందుకున్నారు. ముందు నైట్ షో లకు తొక్కిసలాటల భయంతో నో చెప్పిన తెలంగాణ సర్కార్ తరువాత ఎస్ చెప్పింది. తెలంగాణ సినిమాఆటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ను చిత్ర యూనిట్ ఇటీవలే కలిసి తమ సినిమా ప్రీమియర్ షో కు ఆహ్వానించి తమకు చేయాలిసిన సాయాన్ని అభ్యర్ధించింది. మరోవైపు పవన్ కేసీఆర్ ను కలవడం ఆయనకు లబ్ది చేకూర్చే స్టేట్ మెంట్ కొట్టడంతో క్విడ్ ప్రోకో చక్కగా నడిచింది.

ఏపీ ప్రభుత్వం ముందే అర్ధరాత్రి షో లకు గ్రీన్ సిగ్నల్ ...

ఇక ఏపీ లో ఇంత గొడవ లేకుండానే పవన్ తాజా చిత్రానికి బాబు సర్కార్ పచ్చ జెండా ఊపేసింది. దాంతో ఇప్పుడు అజ్ఞాతవాసి కలెక్షన్ల పరంగా రికార్డ్ స్థాయిలో వసూళ్లు చేసుకునేందుకు రాజమార్గం తెరిచినట్లైంది. మరి బాహుబలి రికార్డ్ లను అజ్ఞాతవాసి టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఈ మధ్యకాలంలో ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు ఏ సినిమాకు ఇవ్వలేదు మరి.

Similar News