ఇజ్రాయిల్ తో మరింత మెరుగైన భారత్ బంధం ...!

Update: 2018-01-16 17:30 GMT

భారత్ ఇజ్రాయిల్ నడుమ వాణిజ్య బంధం మరింత పెరిగింది. మనదేశంలో పర్యటిస్తున్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్, మన ప్రధాని మోడీ నేతృత్వంలో ఇరుదేశాల ప్రతినిధులు చర్చలు జరిపి తొమ్మిది ద్వైపాక్షిక ఒప్పందాలను ఖరారు చేసుకున్నారు. ఇది ఇండియా, ఇజ్రాయిల్ నడుమ కొత్త శకం ప్రారంభమైనట్లేనని ప్రధాని మోడీ అభివర్ణించారు. భారత్ తో మరింత స్నేహాన్ని కోరుకుంటున్నామని ఇజ్రాయిల్ ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మరింతగా భారత అభివృద్ధికి సహాకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

రక్షణ రంగంలో చేయూత కావాలన్న ఇండియా ...

ప్రపంచంలో రక్షణ రంగంలో దుర్భేద్య దేశంగా ఎదిగిన ఇజ్రాయిల్ సహాకారాన్ని భారత్ చర్చల సందర్భంగా కోరింది. తాజాగా జరిగిన ఒప్పందాలు ఇరుదేశాల మైత్రిని సహకారాన్ని మరింతగా పెంపొందిస్తాయని విదేశీ వాణిజ్య వ్యాపారాలు నిర్వహిస్తున్న వారు హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 15 ఏళ్ళతరువాత ఇజ్రాయిల్ ప్రధాని సహా అధికారిక బృందం భారత్ రావడం విశేషం. ఇజ్రాయిల్ ప్రధాని ఆరురోజులపాటు చేపట్టిన ఈ పర్యటన ఇరుదేశాల నడుమ కొనసాగుతున్న ప్రతిష్టంభనలను తొలగించుకునే అవకాశాన్ని ఇచ్చింది. ఇజ్రాయిల్ తో స్నేహాన్ని ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకం గా తీసుకోవడంతో ఇవి ఎంతో ప్రయోజనం ప్రాధాన్యాత ను కల్పించాయి.

Similar News