ఇక స్మార్ట్ పోలీసింగ్ కు అంతా సిద్ధం...!

Update: 2018-01-02 02:30 GMT

దేశం ఎక్కడా లేని విధంగా తెలంగాణ పోలీసులు కొత్త యాప్ ను తీసుకొచ్చారు. పోలీసులంద‌రిని ఒకే గొడుగు కింద‌కు తెచ్చి ద‌ర్యాప్తు స్మార్ట్ గా చేసేందుకు సిద్ధమ‌య్యారు. 2018 వ సంవ‌త్సరాన్ని టెక్నాల‌జీ పోలీసింగ్ ఇయ‌ర్ గా నామ‌క‌ర‌ణం చేసుకున్న డిజిపి ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. టీ.ఎస్. కాప్ అనే యాప్ ను ప్రారంబించారు. హైద‌రాబాద్ లో ఉన్న రియ‌ల్ టైం పోలీసింగ్ ఇక రాష్ట్ర మంత‌ట కానుంది. తెలంగాణ పోలీసులు టెక్నాల‌జీవైపు అడుగులు వేస్తున్నారు. నూత‌న సంవ‌త్సరంలో కొత్త యాప్ తో ద‌ర్యాప్తు స్మార్ట్ గా రియ‌ల్ టైంగా చేసేందుకు 54 స‌ర్వీస్ ల‌తో ప్రారంభించారు. గ‌తంలో హైద‌రాబాద్ కాప్ పేరుతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన అప్పటి సి.పి. మ‌హేంద‌ర్ రెడ్డి. తాజాగా డిజిపిగా అదే పద్థతిని రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేసేలా ప్లాన్ వేశారు. అందుకు టెక్నాల‌జీ పోలిసింగ్ 2018 సంవ‌త్సరంగా ముందుకు వెళ్లుతున్నారు. టీ.ఎస్. కాప్ పేరుతో అంద‌రిపోలీసుల‌ను ఇన్వాల్ చేస్తున్నారు. పెట్రోలింగ్ అధికారి నుంచి క‌మిష‌న‌ర్ వ‌ర‌కు అంద‌రికి స‌మాచారం చేర‌వేయ‌డం. డేటాను షేర్ చేసుకోని నేరం జ‌రిగిన వెంట‌నే అన్ని వివ‌రాలు అందుబాటులో ఉండేలా ఈ యాప్ ప‌నికొస్తుంది.

100 కి డయల్ చేస్తే....

డయల్ -100 కి వచ్చే ఫిర్యాదు లు నేరుగా సమీపంలోని పోలీస్ పెట్రోలింగ్ చేసే సిబ్బందికి చేరతాయి. తక్షణమే పోలీసులు అప్రమత్తత తో సంఘటన స్థలానికి చేరుకుంటారు . బీట్ మేనేజ్ మెంట్, ప‌దే ప‌దే నేరాల‌కు పాల్పడే వారి వివ‌రాలు, జైలు నుంచి బెయిల్ పై విడుద‌లైన నేర‌స్థులు ఆ ప్రాంతంలో ఎవ‌రు ఉన్నారు? శాంతి భ‌ద్రత‌ల‌కు విఘూతం క‌ల్గించేలా అక్కడి ప‌రిస్థితులు ఏంటీ... పోలీసుల‌కు స‌హక‌రించే వారి వివ‌రాలు సైతం అక్కడ ఉంటాయి. ఇంట‌లిజెన్స్ వ్యవ‌స్థ బ‌లోపేతం చేసేలా ఉంటుంది. నేరం జ‌రిగిన ప్రాంతంలోనే పోలీసులు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లకుండానే త్వర‌గా ప‌ని పూర్తి చేసుకోవ‌చ్చు. కీలకైమైన అన్ని వివరాలు రాష్ట్రస్ధాయి నుండి ఉన్నత అధికారివారు అందుబాటులో ఉంటుంది.నేరాలను అదుపు చేయడం తో పాటు నేరాలు జరిగిన ప్రదేశాలకు సత్వరం పోలీసులు చేరుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది.

జియో ట్యాగింగ్ ద్వారా.....

జియో ట్యాగింగ్ ద్వారా TSCOP అనుసంధానం చేస్తారు. నేరాలు జరిగిన ప్రదేశాలకు చేరడం తో పాటు ఫోర్స్ ను అలెర్ట్ చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఒక్క బ‌ట‌న్ నొక్కితే అంద‌రూ అధికారులు అప్రమ‌త్తం అవుతారు. ఒక్కొక్క స్థాయి అధికారులకు వారికి ఉప‌యోగ‌ప‌డే వివ‌రాలు మాత్రమే క‌నిపిస్తాయి. తెలంగాణ రాష్ట్రంలో నేరాలను అడుపుచేయడానికి ఈ యాప్ ఎంత గానో ఉపయోగపడుతుందని డీజీపి అభిప్రాయపడ్డారు. తెలంగాణ పోలీసులు మాత్రమే లాంగిన్ అయ్యే ఈ యాప్.. ఒక్క సారి లాగిన్ అయితే స‌రిపోతుంది. ప్రతి అప్ డేట్ వ‌స్తుంది. అయితే హైద‌రాబాద్ కాప్ యాప్ స‌క్సెస్ కావాడానికి కానిస్టేబుల్స్ టెక్నాల‌జీని వాడుకున్నారు. టెక్నాల‌జీతో ప‌ని ఈజీ అని నిరూపించారు. కాని జిల్లాల్లో పోలీసులు చాల మంది ఇప్పటికి వాట్స్ అప్ కూడా వాడ‌టం లేదు. అలాంటి సిబ్బందికి ఎప్పుడు అప్ డేట్ చేస్తారు. ట్రైనింగ్ ఎలా పూర్తి చేస్తారు. వారు వాడతారా.. మ‌రో 5 సంవ‌త్సరాల్లో రిటైర్డ్ అయ్యే పోలీసులే జిల్లాల్లో ఎక్కువ‌గా ఉన్నారు. సో హైద‌రాబాద్ పోలీసింగ్ లా జిల్లాల్లో పోలీసులు ఎలా వ్యవ‌హరిస్తార‌నేది వేచి చూడాలి. ఈ యాప్ ను పూర్తిగా ఉప‌యోగించుకుంటే స్మార్ట్ పోలీసింగ్ లో దేశంలో తెలంగాణ‌ను మించిన రాష్ట్రం మరొకటి ఉండదు. నేరస్థుల వివ‌రాలు నిత్యం అప్ డేట్ అయి వారి ప్యాకెట్ లో ఉంటాయి.

Similar News