స్థానికులకు ఉద్యోగాలంటూ తన ఎన్నికల ప్రచారం లో యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన హామీ ప్రవాస భారతీయుల కొంప ముంచుతుంది. సుమారు 7 లక్షల మంది ఉద్యోగాలకు ట్రంప్ తెచ్చిన కొత్త సంస్కరణలు ఎసరు పెట్టే పరిస్థితి దాపురించింది. ఇందులో లక్ష మంది భారతీయులే ఉన్నట్లు తేలుతుంది. హెచ్ 1 బి వీసా దారులు, గ్రీన్ కార్డు హోల్డర్స్ సైతం తమ సామాను సర్దేసుకుని స్వదేశం రానున్నట్లు ఒక అంచనా. ముఖ్యంగా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫెస్ బుక్, వంటి దిగ్గజ సంస్థల నుంచే ఐటి ఉద్యోగులు ఇంటిబాట పట్టే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు.
ఇప్పటికే చాలా మంది ...
కొంప ముంచిన ట్రంప్ నిర్ణయాలతో ఇప్పటికే చాలామంది స్వదేశాలకు తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోతున్నారు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులకు ఆందోళన కలిగిస్తున్నాయి. డాలర్స్ డ్రీమ్స్ తో యుఎస్ వెళ్ళిన వారు వెళ్లాలని భావించే వారికి రాబోయే కాలం మరింత గడ్డుపరిస్థితులు ఏర్పడనున్నట్లు నిపుణులు లెక్కలేస్తున్నారు. స్థానికులకే ఉద్యోగాల అంశంలో ట్రంప్ వైఖరి మారే సూచనలు లేకపోవడంతో పలు దేశాల్లో వున్న పెరుగుతున్న నిరుద్యోగానికి కొత్త సమస్య వచ్చి చేరుతుంది. యుఎస్ లో హెచ్ వన్ వీసా పొందడం పెద్ద కంపెనీల్లో చాలా సులువుగా లభించేవి. అలాగే గ్రీన్ కార్డు సంపాదించడం లో ఇబ్బందులు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు హెచ్ వన్ బి వీసా సాధించడం కష్టం తో కూడిన పని అయితే గ్రీన్ కార్డు జారీ మరింత అందని ద్రాక్ష కానుంది.