ఏపీ సీఎం ఆధ్యాత్మిక గురువు అవతారం ఎత్తారు. ఆయన అత్యంత సన్నిహితంగా మెలిగే బాబాల ప్రభావమో హిందూ ఓటు బ్యాంక్ బిజెపికి దూరం చేసే కార్యక్రమమో ఏమో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త రూట్ లో పాలిటిక్స్ మొదలు పెట్టారు. దావోస్ పర్యటన నుంచి వచ్చిన ముఖ్యమంత్రి ఆ వివరాలు తొలుత వెల్లడిస్తారనుకుంది మీడియా. ఆ అంచనాలకు భిన్నంగా బాబు స్పందించారు. సూర్య ఆరాధన అనే కాన్సెప్ట్ తో ముందుకొచ్చారు చంద్రబాబు.
అన్ని సమస్యలకు సూర్యభగవానుడే ...
ఆరోగ్య సమస్యలను పరిష్కరించేది సూర్యుడు, సంపద ఇచ్చేవాడు. సూర్యుడు, కులాలు మతాలకు అతీతంగా సూర్య ఆరాధన మన పురాణ ఇతిహాసాల్లో వుంది. రామాయణం, భారతం, భగవద్గీత అన్నిట్లో సూర్యుడు మహత్తు చెప్పబడింది. ఇప్పుడు ఏపీలో అంతా ఇది అనుసరించాలి. ఉదయాన్నే లేచి రాష్ట్రం అంతా ఏడుగంటలకల్లా సూర్యుడు కి సూర్య నమస్కారాలు చేయాలి. అలా నేను అమరావతిలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నా ఏపీ అంతా ఇది అనుసరించాలంటూ సిఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
గతంలో మోడీ చెప్పిందే ...
గతంలో ప్రధాని మోడీ కానీ బిజెపి పార్టీ వారు సూర్య నమస్కారాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. యోగా సూర్య నమస్కారాలపై భారీ వివాదమే నడిచింది. హిందూ మత విశ్వసాలు జనం మీద రుద్దుతున్నారని మోడీ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన దీనిపై గట్టి వాదనే చేశారు. మోడీ చర్యలు ఉత్తరాదిన హిందూ మత మద్ధత్తుదారుల్లో మంచి జోష్ నే తెచ్చాయి. ఇప్పడు తాజాగా బాబు ఏపీ సంపద సృష్టి సాగాలంటే ప్రజలంతా సకల ప్రాణికోటికి ఆరాధ్యుడైన సూర్యభగవానుడిని వేడుకోవాలనే నిర్ణయానికి రావడం ఎలాంటి విమర్శలకు దారితీస్తుందో చూడాలి. సన్ రైజ్ ఏపీ కి బాబు ఇప్పుడు కొత్త అర్ధం తెచ్చారన్నదానిపైనా చర్చలు విమర్శలు వెల్లువెత్తేలాగే వున్నాయి.