ఆర్కే నగర్ జల్లికట్టు మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల లెక్కింపు కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రానికి అధికారులు,పోలింగ్ ఏజెంట్లు అభ్యర్థులు చేరారు. ఆర్కే నగర్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతోంది. జయలలిత వారసుడెవరో మరికాసేపట్లో తేలనుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్, డీఎంకే అభ్యర్థి మరదు గణేశ్ మధ్యనే ఉంది. ఇక్కడ బీజేపీ కూడా పోటీ చేస్తుండగా, డీఎంకేకు కాంగ్రెస్ తోపాటు మిగిలిన పక్షాలు మద్దతిస్తున్నాయి. మరికాసేపట్లో తొలి ఫలితం రానుంది.