ఆర్కేనగర్ ఎన్నిక ఎప్పుడంటే...?

Update: 2017-11-24 05:32 GMT

ఆర్కే నగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. డిసెంబర్ 21వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. 24వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నిక జయలలిత మరణంతో జరగనుంది. గతంలో ఎన్నికకు నోటిఫికేషన్ ఇచ్చినా శశికళ మేనల్లుడు దినకరన్ దాదాపు 90 కోట్లు విచ్చలవిడిగా ఓటర్లను కొనుగోలు చేసేందుకు ఖర్చు చేశారని తేలడంతో అప్పట్లో ఉప ఎన్నికను రద్దు చేసింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 31వ తేదీలో ఎన్నికలు జరపాలని ఆదేశించడంతో డిసెంబర్ 21న పోలింగ్ ఆర్కే నగర్ కు జరగనుంది.

Similar News