TDP : వరస వివాదాల్లో వాసంశెట్టి.. ఏంది సామీ ఇది?

మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై సర్పంచ్ శ్రీనివాస్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది

Update: 2026-04-07 06:58 GMT

రామచంద్రాపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రిపై సర్పంచ్ శ్రీనివాస్ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. తనపై వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యంపై సర్పంచ్ ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే సర్పంచ్ శ్రీనివాస్ వాసంశెట్టి సత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం సర్పంచ్ శ్రీనివాస్ మాత్రం తనను కొట్టడమే కాకుండా తనపై ఎస్.సి, ఎస్టీ కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చి పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని తాను ప్రశ్నించినందుకే తనను నిర్భంధించి కొట్టారంటూ ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

నెలరోజులకే అన్నీ...
వాసంశెట్టి సుభాష్ పార్టీలో చేరిన నెలరోజులకే ఎమ్మెల్యే టిక్కెట్టు దక్కించుకున్నారు. ఆ తర్వాత కూటమి హవాలో తెలిచిన వాసంశెట్టి సుభాష్ కు చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి కూడా లభించింది. తొలిసారి ఎమ్మెల్యేగా అయినప్పటికీ ఆయన సామాజికవర్గాన్ని చూసి చంద్రబాబు కేబినెట్ లో చోటు కల్పించారు. కార్మిక శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు. గతంలోనూ వాసంశెట్టి సుభాష్‌ పనితీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సక్రమంగా పార్టీ సభ్యత్వాలు చేర్చకపోవడంతో పాటు మంత్రిగా శాఖపై పట్టుసాధించలేదని చంద్రబాబు పలుమార్లు వాసంశెట్టి సుభాష్ ను హెచ్చరించారు. చంద్రబాబు అసహనం వ్యక్తం చేసిన ఆడియో బయటకు వచ్చి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.
అంతా తానే అయి...
రామచంద్రపురం నియోజకవర్గంలో ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం వల్లనే వాసంశెట్టి సుభాష్ ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆయన తండ్రి వాసంశెట్టి సత్యం నియోజకవర్గంలో అంతా తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి వేరే వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అంటున్నారు. దీంతో రామచంద్రపురంలో ఒకప్పటి టీడీపీ క్యాడర్‌ అంతా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికారిక కార్యక్రమాలకు కూడా సత్యం హాజరు కావడం విమర్శలకు దారి తీసింది. వాసంశెట్టి సత్యం ఎలాంటి రాజకీయ పదవిలో లేరు. మంత్రికి తండ్రి కావడంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అదే పేరుతోనే నియోజకవర్గంలో అంతా చక్రం తిప్పుతున్నారంటూ పార్టీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి. తాజా వివాదంతో మరోసారి ఆయన వార్తల్లోకి ఎక్కినట్లయింది.


Tags:    

Similar News