వచ్చే నెలలో రాజ్యసభ కు ఖాళీ అవుతున్న మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ మూడు స్థానాల్లో టిడిపి కి రెండు, వైసిపి కి ఒక స్థానం వచ్చే అవకాశాలు వున్నాయి. ఇప్పటికే 22 మంది వైసిపి ఎమ్యెల్యేలు తమ పార్టీ నుంచి టిడిపి గోడ దూకేశారు. మరో ఇద్దరు ఎమ్యెల్యేలు చేరితే వైసిపి కి రాజ్యసభ ఎన్నికల్లో చుక్కెదురు కానుంది. ఈ నేపథ్యంలోనే కొంత కాలంగా టిడిపి మరో ఇద్దరు ముగ్గుర్ని ఎలాగైనా లాగేయాలన్నది పసుపు పార్టీ వ్యూహం. అందులో భాగంగానే వైసిపి గుంటూరు జిల్లా ఎమ్యెల్యే మహమ్మద్ ముస్తఫా కు గాలం విసిరారని ప్రచారం జోరందుకుంది.
సిఎం ను కలవడం వెనుక ...
గతంలో పార్టీ మారేముందు అందరు ఎమ్యెల్యేలు చెప్పిన మాటే ముస్తఫా కూడా చెప్పారు. నియోజకవర్గ అభివృద్హి కోసమే చంద్రబాబు తో భేటీ అని ఆయన నొక్కి వక్కాణించారు. తాను అందరిలాంటివాడిని కాదని చెప్పుకొచ్చారు. వైసిపి ఎమ్యెల్యేలు నిధులు అడగడం లేదని సిఎం చెబుతున్నారని తన నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు అడిగాడానికే వెళ్ళనే తప్ప పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు ముస్తఫా. ఎట్టి పరిస్థితుల్లో వైసిపిని వీడేది లేదని చెప్పుకొచ్చారు. ఈ పరిణామం మాత్రం వైసిపి ని ఖంగుతినిపించింది. టిడిపి విసిరే వలకు మిగిలిన ఎమ్యెల్యేలు ఎవరు చిక్కకుండా రాజ్యసభ ఎన్నికల వరకు కాపాడుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది వైసిపి.