ఆత్మహత్యలపై గంటా నాటకం వెనుక ...?

Update: 2017-10-17 09:30 GMT

కార్పొరేట్ విద్యలో సమిధలుగా మారుతున్న విద్యార్థుల మరణాలు ఇప్పటికి ఇప్పుడు వచ్చినవేమి కావు. చదువుకోవడం కాకుండా చదువు"కొనడం" మొదలు పెట్టినప్పటినుంచి నడుస్తున్నవే. ముఖ్యంగా ఒక పెద్ద కార్పొరేట్ విద్యా సంస్థకు అధిపతిగా తెలంగాణ ఏపీలో తన సువిశాల విద్యా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన నారాయణ ను ఎమ్యెల్సీ ని చేసి మంత్రిగా ఏ అనుభవం లేకపోయినా తీసుకుంది తెలుగుదేశం. ఆనాటినుంచి కార్పొరేట్ విద్యా సంస్థల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇక మంత్రి నారాయణ మరో మంత్రి గంటా శ్రీనివాస రావు తో వియ్యం అందుకోవడం ఆయన స్వయానా విద్యా శాఖా మంత్రిగా ఉండటం తో అన్ని నిర్ణయాలు కార్పొరేట్ విద్యకే అనుకూలంగా సాగిపోతున్నాయి. ఇవన్నీ తెలిసినా ఆపార అనుభజ్ఞుడు చంద్రబాబు వారిద్దరి మాట కాదనలేని పరిస్థితిని వియ్యంకులు కొనితెచ్చారు. విపక్షంలో ఉండగా పార్టీ ఫైనాన్స్ ర్ గాఎన్నికల్లో అడిగినంత బాబుకి నారాయణే సర్దారన్న ఆరోపణలు వున్నాయి. ఆ వీక్ నెస్ తోనే బాబు కార్పొరేట్ విద్యపై కనీస చర్యలు తీసుకోలేక పోయారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

ఎన్నికలు దగ్గిర పడుతుండటంతో ....

ఇప్పుడు ప్రజల దగ్గరకు వెళ్ళి ముఖం చుపించాలిసిన తరుణం సమీపిస్తోంది. ఇన్నాళ్లు కట్టిన నాటకాలు వారు కడిగేస్తారు. దాంతో సర్కార్ లో కదలిక వచ్చింది. మూడున్నరేళ్లలో వైసిపి కమ్యూనిస్ట్ లు పీడీఎస్ యు , ఎబివిపి వంటి విద్యార్థి సంఘాలు గొంతు చించుకున్నా కనీసం కౌంటర్ ఇవ్వని సర్కార్ తాజాగా విపక్షాలన్నీ ఇచ్చిన బంద్ తో కళ్ళు తెరిచినట్లు నటించడం మొదలు పెట్టింది. హడావిడిగా సమీక్షలు నిర్వహించేసి కమిటీలు చర్యలు అంటూ హంగామా మొదలెట్టేసింది. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు సినిమాల్లో నటులు కూడా చేయని యాక్షన్ షూరూ చేసేసారు. తన వియ్యంకుడి విద్యా సంస్థలకు వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పుడు అందరు నెంబర్ వన్ బుద్ధిమంతులమని మార్కులు వేసుకునే పనిలో పడ్డారు. అసలు విద్యా విధానంలోనే లోపాలు ఉన్నాయని ఇప్పుడు ఇస్తున్న ర్యాంక్ ల స్థానంలో గ్రేడింగ్ ప్రకటించారు.

గతంలో వేసిన కమిటీలు ఇచ్చిన నివేదికలు బుట్ట దాఖలు ...

విద్యా వ్యవస్థలో మార్పులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన అనేక కమిటీలు చక్కటి సూచనలు చేశాయి. కానీ వాటిని ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఇప్పుడు హడావిడిగా మళ్ళి విద్యా సంస్థల్లోనే కమిటీలు అని అంటోంది. భావి భారత పౌరులను తయారు చేస్తున్న విద్యా సంస్థలు ఏ విధంగా ఉండాలి ? ఏవిధంగా ఉంటున్నాయి ? మూడున్నరేళ్ళ తరువాత ఇప్పుడు ప్రజాఅందోళన తో సర్కార్ రోబోటిక్ వ్యవస్థ నడుస్తుంది అని గుర్తించిందా ? చదువు తప్ప విద్యార్థుల్లో మానసిక శారీరక ఎదుగుదలకు విద్యా సంస్థలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించిందా ? ఇదంతా డ్రామా కాక మరేమిటి అన్నది విద్యా నిపుణుల ఆవేదన. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యా మాఫియా ఆగడాలకు చెక్ పెట్టాలి అంటే ముందు తన కేబినెట్ నుంచే శ్రీకారం చుట్టాలన్నది వారి అభిప్రాయం ..

Similar News