ఆడామగా తేడా లేదు ... తెగ తాగేస్తున్నారే...?

Update: 2018-01-07 03:20 GMT

వీకెండ్ వస్తే చాలు హైదరాబాద్ రోడ్లు తాగుబోతుల వీరంగాలతో దర్శనమిస్తున్నాయి. ఇందులో ఆడా మెగా తేడా లేనే లేదు. విశ్వనగరంలో విశృంఖలంగా సాగుతున్న తాగుబోతుల వీరంగాన్ని అడ్డుకోవడం పోలీసుల వల్లకూడా కావడం లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అధికభాగం బడా బాబుల పిల్లలు ఊగుతూ తూగుతూ దొరికిపోతున్నారు. వీరు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లకు సహకరించడానికి నిరాకరిస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాగి డ్రైవ్ చేస్తూ చిక్కిపోతున్న వీరినోట్లో గొట్టం పెట్టి ఊదించడం చేసేటప్పటికీ పోలీసులకు తలప్రాణం తోకకు వస్తుంది.

తాజాగా మరో మహిళ మృతి ...

హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లో విష్ణువర్ధన్ అనే వ్యక్తి తప్పతాగి డ్రైవ్ చేసి స్కూటీ పై వెళుతున్న ముగ్గురు మహిళలను ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో మస్తానీ అనే మహిళ అక్కడికక్కడే చనిపోయింది. ప్రియా అనూష అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్కూటీ ని ఢీకొని తప్పించుకునే క్రమంలో విష్ణువర్ధన్ భీభత్సం సృష్ట్టించి అక్కడ డివైడర్ ని ఢీకొని పోలీసులకు పట్టుపడ్డాడు. నిశీరాత్రి జరుగుతున్న ఈ ప్రమాదాలు నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతంలో ఒక చిన్నారిని తప్ప తాగి పట్టపగలే తాగుబోతులు బలిగొన్నారు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు అలాగే దుర్మరణం పాలయ్యారు. ఆయన తాగింది లేనిది పోలీసులు వత్తిడి కారణంగా నిర్ధారించలేదు. పోలీసులు ఎంత నిఘాలు, పరీక్షలు నిర్వహిస్తున్నా తాగుబోతుల ఆగడాలకు మాత్రం చెక్ పడక పోవడం గమనిస్తే విశ్వ నగరంలో అర్ధరాత్రి విహారం అత్యంత ప్రమాదకరమని తేలుతుంది.

Similar News