కొండాపూర్‌లో సంచలనం కలిగించిన గర్భిణి హత్యకేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌కుమార్ భార్య ఉండగానే మహారాష్ట్రకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె గర్భం దాల్చడంతో వివాహం చేసుకోవాలంటూ వత్తిడి తెచ్చింది.
పథకం ప్రకారం....
దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలి చూసిన విజయ్‌కుమార్ పథకం ప్రకారం ఆమెను హతమార్చాడు. గత నెల 28న ఆమెను హత్య చేసి చిన్న చిన్న ముక్కలుగా నరికి, గోనె సంచిలో కుక్కి, బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. హత్య చేసిన రెండు రోజులకే విజయ్ హైదరాబాద్ విడిచి పారిపోయాడు. మరో వ్యక్తి ఈ హత్యకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు.
సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా....
మాదాపూర్‌లోని సిద్ధిక్ నగర్‌లోని విజయ్ ఇంటిని పోలీసులు గుర్తించారు. సీసీ టీవీ పుటేజీల ద్వారా ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు హంతకుల కోసం గాలింపు చేపట్టారు. విజయ్‌కుమార్ వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు.ఆదివారం ఉదయమే ఈ కేసులో పోలీసులు అసలు నిందితులను గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా తమదైన శైలిలో విచారణ చేపట్టిన పోలీసులు చివరకు కేసును ఓ కొలిక్కితీసుకొచ్చారు.
బైక్ నెంబర్ తో.....
ఈ హత్య కేసులో కీలక నిందితులను సీసీటీవీ పుటేజీ ద్వారా గుర్తించారు. మృతదేహాన్ని ఏపీ 10 ఏఎల్ 9947 నంబర్ ఉన్న యమహా బైక్‌పై తీసుకువచ్చి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేసి వెళ్లిపోయినట్లు నిర్ధారించారు. బైక్ ఎవరిదని విచారించగా బౌద్దనగర్‌లోని ఆనంద్ కుటీర్‌కు చెందిన గర్డే విజయ్‌కుమార్‌కు చెందినదిగా గచ్చిబౌలి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు నిందితుల ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గచ్చిబౌలి పోలీసులు మృతురాలు మహారాష్ట్ర వాసిగా గుర్తించారు. కొండాపూర్‌తో పాటు నగరంలో నివాసం ఉంటున్న మహారాష్ట్ర, అస్సాం వాసులను పోలీసులు విచారిస్తున్నారు. పదిరోజుల కొందరు గుర్తు తెలియని వ్యక్తులు క్రితం మహిళ మృతదేహాన్ని ముక్కలుగా నరికి గోనె సంచిలో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేసిన సంగతి తెలిసిందే.