తన వివాహ విశేషాలు ఒకొక్కటిగా ట్విట్టర్ లో పెడుతూ అభిమానులతో ఆనందం పంచుకుంటున్నాడు విరాట్. ఇప్పుడు విరాట్ అనుష్కల పెళ్ళి విశేషాలతో ట్విట్టర్ మోతెక్కిపోతుంది. కోట్లాది మందికి అభిమాన క్రికెటర్ గా వున్న కోహ్లీ పెళ్ళంటే అందరికి ఆసక్తే. దాంతో విరాట్ ట్విట్టర్ అకౌంట్ హిట్స్ క్షణక్షణానికి పెరిగిపోతుంది. తన ప్రియురాలికి నాలుగు నెలలపాటు కస్టపడి తిరిగి ఆస్ట్రేలియన్ డైమండ్ డిజైనర్ తో సంప్రదించి కోటి రూపాయల వజ్రపుటుంగరాన్ని కానుకగా కోహ్లీ అందించాడు. ఈ ఫోటో తో పాటు కోహ్లీ పెళ్లిలో పాడిన అనుష్కపై పాడిన పాట వైరల్ గా మారింది. ఇక వారిద్దరి పెళ్ళి ఫోటోల సందడి అంతా ఇంతా కాదు.
ఇటలీ లో పెళ్ళి ఆయన ఇచ్చిన సలహా ...
కోట్లాది మంది అభిమానులు భారత్ లో ఉండగా ఇటలీ లో పెళ్లి ఏమిటి అంటూ అంతా చెవులు కొరుక్కుంటున్నారు. దీనికి ఒక ప్రత్యేక కారణమే ఉందని కొత్త జంట సన్నిహితులు లీక్ చేశారు. అనుష్కను బాలీవుడ్ కి పరిచయం చేసిన ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా. ఆయనే ప్రశాంతంగా పెళ్ళి జరగాలంటే ప్రపంచంలో ఇటలీ ని మించింది లేదన్నారుట. చోప్రా కూడా తన గర్ల్ ఫ్రెండ్ రాణీముఖర్జీ తో ఏడడుగులు నడిచింది ఇటలీలోనే. తన గురువు చెప్పడంతో అనుష్క విరాట్ ను ఒప్పించి మేరేజ్ ప్లేస్ అక్కడ ప్లాన్ చేసిందని తేలింది.