ఆ ఎమ్మెల్యేను కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా?

Update: 2017-07-12 13:04 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీరియస్ అయ్యారు. కలెక్టర్ ను ఎమ్మెల్యే శంకర్ నాయక్ అవమానించడంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చేత కలెక్టర్ ప్రీతి మీనాకు క్షమాపణ చెప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ బాధ్యతను మంత్రులు కడియం శ్రీహరి, చందూలాల్ తోపాటు ఎంపీ సీతారాం నాయక్ కు అప్పగించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ కు క్షమాపణ చెప్పకుంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. మహబూబాబాద్ లో హరితహారం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ప్రీతి మీనాకు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మధ్య వివాదం చోటు చేసుుంది. దీంతో శంకర్ నాయక్ కలెక్టర్ ను దూషించడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఆర్టీఓ కార్యాలయం ఎదుట నల్లబ్యడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి వెంటనే రంగంలోకి దిగి శంకర్ నాయక్ కు వార్నింగ్ పంపారు. మరి శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణ చెబుతారా? లేక పార్టీ నుంచి సస్పెండ్ అవుతారో? చూడాల్సిందే.

Similar News