అసలేం జరిగింది?

Update: 2018-02-26 06:30 GMT

అందాల తార శ్రీదేవి ఆకస్మిక మరణం ఎలా సంభవించిందన్న దానిపై ఇప్పటికీ ఆమె అభిమానులు నమ్మడం లేదు. శ్రీదేవి శనివారం రాత్రి తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందారు. అయితే ఆమె చనిపోవడానికి ముందు వివాహ వేడుకలకు హాజరయ్యారు. శ్రీదేవితో పాటు ఆమె భర్త బోనీ కపూర్ కూడా ఉన్నారు. శ్రీదేవి కుటుంబం దుబాయ్ లోని జువైరా ఎమెరేట్స్ టవర్స్ హోటల్ లో దిగారు. అయితే మధ్యాహ్నం వివాహానికి హాజరయి వచ్చిన శ్రీదేవి హోటల్ గదిలో నిద్రపోయారు. అయితే రాత్రి భోజనానికి వెళ్లామని బోనీకపూర్ నిద్రలో ఉన్న శ్రీదేవిని లేపారు.

బాత్ టబ్ లోనే మరణం.....

అయితే స్నానం చేసి వస్తానని శ్రీదేవి బాత్ రూమ్ లోకి వెళ్లారు. అయితే శ్రీదేవి అరగంట సేపయినా రాకపోవడంతో బోనీ కపూర్ తలుపుకొట్టి పిలిచారు. అయితే లోపల నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో వెంటనే తన సన్నిహితుడికి బోనీ కపూర్ ఫోన్ చేశారు. ఈలోపు హోటల్ యాజమాన్యానికి తెలపడంతో సిబ్బంది వచ్చి బాత్ రూమ్ తలుపులు పగలకొట్టి చూడగా బాత్ టబ్ లో శ్రీదేవి అచేతనావస్థలో పడిపోయి ఉండటం కన్పించింది. వెంటనే దుబాయ్ లోని వైద్యులకు ఫోన్ చేశారు. పోలీసులకూ ఫోన్ చేశారు. వైద్యులు వచ్చి చూసి శ్రీదేవి మరణించిందని ధృవీకరించారు.

ఎందుకింత ఆలస్యం....?

అయితే దుబాయ్ లో శనివారం రాత్రి చనిపోయిన శ్రీదేవి భౌతిక కాయాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఎందుకు ఇంత లేటయిందన్న అసహనాన్ని అభిమానులు ప్రదర్శిస్తున్నారు. అయితే దుబాయ్ లో ఉన్న కఠిన చట్టాల కారణంగానే భౌతిక కాయానికి చేయాల్సిన పనులన్నీ ఆలస్యమయ్యాయి. శ్రీదేవి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించారు. నిన్న ఆదివారం కావడంతో వైద్యులు అందుబాటులో లేరని చెబుతున్నారు. పోస్టు మార్టం తర్వాత భౌతిక కాయానికి ఎంబాంబింగ్ చేయనున్నారు. తర్వాత శ్రీదేవి పాస్ పోర్టును కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ అధికారిక కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత భౌతిక కాయాన్ని బంధువులకు అప్పగిస్తారు. ఈరోజు సాయంత్రానికి శ్రీదేవి పార్థీవశరీరం ముంబయికి చేరుకునే అవకాశముంది.

Similar News