అర్జున్ రెడ్డి బిజినెస్ స్టార్ట్ చేసాడు!!

Update: 2018-02-24 13:00 GMT

అర్జున్ రెడ్డి సినిమాతో సింగల్ నైట్ స్టార్ అయ్యాడు మన విజయ్ దేవరకొండ. యాక్టింగ్ చేస్తూనే మరోవైపు మనవాడు బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు. అది కూడా సినిమా రంగంలోనే. తన సొంత సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా మారనున్నాడు విజయ్.

ట్యాక్సీ వాలాతో....

ప్రస్తుతం గీత ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు పరాశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మరో సినిమా రాహుల్ సంక్రీత్యాన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా బడ్జెట్ 3 కోట్లు. ఈ సినిమాకు ట్యాక్సీ వాలా అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసారు. మొదటి ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించాలని అనుకున్నారు. కానీ అర్జున్ రెడ్డికి వచ్చిన మార్కెట్ వల్ల ఈ సినిమా బడ్జెట్ పెంచక తప్పలేదు.

సినిమా హక్కులను...

అసలు విషయానికి వస్తే...ఈ ట్యాక్సీ వాలా ఓవర్సీస్ హక్కులను విజయ్ దక్కించుకున్నాడని తెలుస్తోంది. రూ.80 లక్షలకు సెట్ చేసుకుని ఓవర్సీస్ లో భారీ రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు విజయ్. అర్జున్ రెడ్డి ఓవర్సీస్ లో మంచి వసూల్ అందుకుంది. ఆ ధీమాతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు విజయ్. అదండీ సంగతి.

Similar News