గొడవలెందుకు ఢిల్లీ రండి కూర్చుని మాట్లాడుకుందాం అని ఆహ్వానించారు. ఇంకేముంది బిజెపి జాతీయ అధ్యక్షుడే అంత మాట అన్నాక ఏదో ఒక లబ్ది చేకూరాకపోదుగా అని భావించాయి టిడిపి వర్గాలు. ఏకంగా ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు ని తీసుకుని మరీ కేంద్రమంత్రి సుజనా చౌదరి చక చకా టిడిపి ఎంపీలతో కూడి అమిత్ షా ఇంటికి తీసుకువెళ్ళారు. ఈ పరిణామాలు వేగంగా సాగడంతో ఎదో కదలిక వచ్చిందని వస్తుందని ఇటు మీడియా అటు ఎపి ప్రజలు ఆసక్తిగా పరిణామాలు గమనించడం మొదలు పెట్టారు. తీరా ఏమి జరిగింది. ఢిల్లీ కి ఆహ్వానించిన షా మెల్లగా షాకింగ్ న్యూస్ చెప్పారు. మీరు నాతో కాదు అరుణ్ జైట్లీ తో కూర్చుని మాట్లాడుకోండి అంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ఈ పరిణామం ఊహించని తెలుగు తమ్ముళ్ళు ఒక్కసారిగా ఢీలా పడ్డారు. చేసేది లేక జైట్లీ దగ్గరకి క్యూ కట్టారు.
అక్కడ సేమ్ సీన్ ...
పార్లమెంట్ లో పాడిందే పాటగా రెండుసార్లు అసలు విషయం కాకుండా అఖ్ఖరలేనిదంతా మాట్లాడిన జైట్లీ తిరిగి పాత పాటే చర్చల్లో ఆలపించారని టాక్. ఈ చర్చల వివరాలు కక్కలేక మింగలేక టిడిపి నేతలు సతమతం అయ్యారు. ఎపి ఆర్ధికమంత్రి యనమల, సుజనా చౌదరి మీడియా మీట్ లలో మెత్తగా మాట్లాడారు. కేంద్రం ఇవ్వలిసిన లోటు బడ్జెట్ పైనే ఈ టీం ఒక క్లారిటీ ఇవ్వలేకపోయింది. వేగంగా మీడియా నుంచి ఎదురైన చాలా ప్రశ్నలకు టిడిపి నేతలు నీళ్ళు నమిలారు. కేంద్ర, రాష్ట్రాల ఆర్థికమంత్రుల నడుమ నడిచిన చర్చ ఆశించిన ఫలితం ఇవ్వలేదన్నది మాత్రం స్పష్టం అయ్యింది.