అమరావతి హడావిడికేనా ..? స్పీకర్ కోడెల ఆదేశాలతో అనుమానాలు ..?

Update: 2018-01-03 09:30 GMT

మూడున్నరేళ్లుగా అదిగో అమరావతి ప్రపంచస్థాయి రాజధాని అని చుక్కల్లో టిడిపి సర్కార్ చూపించింది. నిన్న మొన్నటి వరకు డిజైన్స్ పైనే తర్జన భర్జన చేసి ఎట్టకేలకు ఫైనల్ డిజైన్ కి గ్రీన్ సిగ్నల్ దక్కింది. హమ్మయ్యా ఇప్పటినుంచి మంత్రి నారాయణ చెప్పినట్లు ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత రాజధాని పని మొదలై ఏడాదిలో పూర్తి అవుతుందన్న ప్రచారం గట్టిగా నడిచింది. తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం మరో ఏడాదిలో నూతన అమరావతిలోకి వెళ్ళిపోతాయన్నంత బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా ఎపి స్పీకర్ కోడెల శివప్రసాద్ చేసిన ప్రకటన ఇప్పట్లో నూతన అమరావతి ఏర్పడదనే అనుమానాలు రేకెత్తిస్తుంది.

కొత్త బ్లాక్ ల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోడెల ...

మంత్రులు, పార్టీ విప్ లు, అధికారులకు ప్రస్తుతం వున్న సచివాలయం చాలడం లేదు. దాంతో స్పీకర్ కోడెల కొత్త బ్లాక్ లు నిర్మించాలని ఆదేశించారు. డిజైన్ల ఖరారు పూర్తి అయిందని ఏడాదిలోగా అమరావతి నిర్మాణం అత్యాధునిక సాంకేతికత తో పూర్తి చేస్తామని ఇటీవలే మునిసిపల్ మంత్రి, రాజధాని వ్యవహారాలు చూస్తున్న నారాయణ స్పష్టం చేశారు. అదే నిజమైతే కొత్త బ్లాక్ ల నిర్మాణం అనవసరం. శాస్వీతంగా నిర్మించే ప్రాంతంలోనే అత్యవసర నిర్మాణాలు కొన్ని త్వరిత గతిన పూర్తి చేయగలిగితే ప్రజాధనం వృధా కాదు. అలా కాకుండా తాత్కాలిక భవనాలు పెంచుకుంటూ పోతే నవ్యంధ్ర రాజధాని కల ఇప్పట్లో సాధ్యం కాదనే అనుమానాలకు సర్కారే బలం చేకూర్చింది అవుతుంది. ఇప్పడు అదే విధంగా టిడిపి సర్కార్ అడుగులు పడుతూ ఉండటం మరింత విమర్శలకు దారితీస్తుంది.

Similar News