అన్నా...అదిరేటి డ్రస్సు నీదయితే...!

Update: 2017-11-28 06:50 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. మంత్రి కేటీఆర్ అదిరేటి డ్రెస్స్ లు వేస్తారు. ఆహార్యం కూడా అదిరిపోతోంది. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే కేటీఆర్ కు ఒక సమస్య వచ్చిపడిందట. ఈరోజు రెండు ముఖ్యమైన ఈవెంట్లు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. ఒకటి మెట్రోరైలు ప్రారంభం. రెండోది ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు. ఈ రెండు సదస్సులకు ఏ డ్రెస్ వేసుకోవాలన్నది కేటీఆర్ ను వేధిస్తోంది. ఆయన ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాను చాలా బిజీగా గడుపుతున్న రోజు ఇదేనని, ఏం ధరించాలో ఆలోచించే సమయం కూడా లేదని సరదాగా కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే దీనిపై నెటిజెన్లు వెంటనే స్పందించారు. కొందరు సూటు వేసుకోవాలని సూచించగా, మరికొందరు పోచంపల్లి చేనేత వస్త్రాలు ధరించమని కేటీఆర్ కు సలహా ఇచ్చారు. మొత్తం మీద కేటీఆర్ కు ఇది ముఖ్యమైన రోజు.. మరి రెండు ఈవెంట్లలో కేటీఆర్ ఏ డ్రస్ వేస్తారోనన్న ఆసక్తి నెలకొంది. చూద్దాం మరికాసేపట్లో ఆయన ఏ డ్రెస్ లో మెరిసిపోతారో...!

Similar News